పొలిటికల్ ఎంట్రీకి ఉద్యోగ నేతల ఆరాటం ..రెండు రాష్ట్రాల్లోనూ ఇదే తంతు  

తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో కి కొంతమంది ఉద్యోగులు అడుగు పెట్టేందుకు అన్నీ వైపులా దారులు సిద్ధం చేసుకుంటున్నారు. సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉదోగాలు చెయ్యడం వలన రాజకీయాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, అదే తమకు పెద్ద అర్హతగా ఫీల్ అవుతూ తమకు అనుకూలంగా ఉన్నా పార్టీలో బెర్త్ కోసం ఇప్పటి నుంచే తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. గతంలో ఉద్యోగ సంఘాల నేతలుగా ఉన్న కొంతమంది ఇప్పటికే రాజకీయాల్లో చేరి ఎమ్యెల్యేలు అయిపోవడంతో వీళ్ళ కాళ్ళు ఎక్కడా నిలబడడం లేదు. తెలంగాణాలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేయడంతో కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు.

Employee Union Presidents Wants To Participate In Elections-

Employee Union Presidents Wants To Participate In Elections

తెలంగాణ ఉద్యమ సమయంలో స్వామిగౌడ్ వంటి ఉద్యోగ సంఘాల నాయకులు చురుకైన పాత్ర పోషించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఆశోక్ బాబు వంటి నాయకులు కూడా సమైక్య ఉద్యమంలో పాల్గున్నారు. తెలంగాణలో స్వామి గౌడ్ ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఈసారి కూడా కొందరు ఉద్యోగ నాయకులు ఎన్నికలలో పోటి చేసేందుకు రెడీ అవుతున్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుంచి టికేట్లు ఆశిస్తున్నారు.

ఏపీలో టీడీపీ, వైసీపీ ల నుంచి బరిలో దిగేందుకు సన్నద్దమవుతున్నారు. వరంగల్ నుంచి పోటి చేసేందుకు టిఎన్జీఓఏ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి తన ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలసి తనకు టికెట్టు కేటాయించాల్సిందిగా కోరారు. అదే జిల్లాకు చెందిన ఉద్యోగ జేఏసీ చైర్మన్ సుబ్బారావు కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేసారు. టిఆర్ ఎస్ లేదా కాంగ్రెస్ తరఫున పోటి చేసేందుకు పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతోద్యోగి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ కు చెందిన కార్మికశాఖలో పనిచేస్తున్న ఓ ఆఫీసర్ కూడా టికేట్టు కోసం ఇటు టిఆర్ఎస్ నాయకులను అటు కాంగ్రెస్ నాయకులను కలిసి తరుచు కలుస్తున్నట్టు తెలుస్తోంది.

Employee Union Presidents Wants To Participate In Elections-

ఏపీలో చాలామంది ఉద్యోగ సంఘాల నేతలు ఈ సారి ఎన్నికలలో పోటి చేయాలని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు అశోక్ బాబును టీడీపీ లో చేరాలంటూ చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. అలాగే తిరిగి సొంత గూటికి చేరుకున్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆశోక్ బాబుకు ఫోన్ చేసి కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. విశాఖపట్నం పంచాయితీ రాజ్ శాఖలోను జిల్లాపరిషత్ లోను కీలకమైన ఉద్యోగాలు చేసిన ఓ అధికారి కూడా ఈ సారి పోటి చేయాలనుకుంటున్నారు. తూర్పుగోదావరికి చెందిన ఆ అధికారి విశాఖ జిల్లా నుంచి వైసీపీ తరపున పోటి చేయాలని ఆరాటపడుతున్నాడు. ఇంకా అనేక మంది ఉద్యోగులు ఎన్నికల సమయానికి తెరమీదకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.