ఎమోషనల్ వీడియోను పంచుకున్న బీసీసీఐ..!

చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా రెండో టెస్టు ఆడుతోంది.శనివారం రోజు ఎం.

 Emotional Video Shared Ipl, Bcci, Second March Series, Permission , Granafter-TeluguStop.com

ఎ.చిదంబరం స్టేడియం లో ప్రారంభమైన ఈ రెండవ టెస్ట్ కి క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు.ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో అభిమానులు కిటకిటలాడారు.మొన్నటి వరకు టీవీల్లో చూసి బాగా అలసిపోయిన అభిమానులు నిన్న ఎప్పటిలాగానే ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ ఎంతో కోలాహలం గా మ్యాచ్ ని ఎంజాయ్ చేశారు.

కరోనా మహమ్మారి కారణం ఏడాది కి పైచిలుకు ఫ్యాన్స్ ని క్రికెట్ స్టేడియం లోకి అనుమతించలేదన్న విషయం మనకు తెలిసిందే.

నిజానికి కొవిడ్ – 19 వలన చాలా నెలల పాటు ఎటువంటి క్రికెట్ మ్యాచులు నిర్వహించలేదు.

కానీ దుబాయ్ వేదికగా సెప్టెంబర్, నవంబర్ మధ్య కాలంలో ఐపీఎల్ 13 సీజన్ నిర్వహించారు.అయితే ఈ మ్యాచులకు కూడా క్రికెట్ అభిమానులను అనుమతించలేదు.

కరోనా కారణంగా రసవత్తరమైన ఐపీఎల్ మ్యాచ్లను కూడా టీవీ లోనే చూడాల్సి వచ్చింది.తాజాగా ప్రారంభమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ మ్యాచుల్లో కూడా అభిమానుల ఎంట్రీ కి అనుమతి లభించలేదు.

Telugu Bcci, Gran, March, India-Latest News - Telugu

కానీ చెన్నైలో ఇంగ్లాండ్ – భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ కి మాత్రం అభిమానుల ఎంట్రీ కి బీసీసీఐ అనుమతి ఇచ్చింది.దీనితో అభిమానులు పెద్ద ఎత్తున ఎం.ఎ.చిదంబరం స్టేడియం కి సేమ్ తరలి రావడం ప్రారంభించారు.మరికొందరు ఆన్లైన్ లో సీట్లను బుక్ చేసుకున్నారు.

అయితే తొలిసారిగా అభిమానులను స్టేడియానికి ఆహ్వానిస్తున్న సందర్భంగా బీసీసీఐ ఒక ఎమోషనల్ వీడియో తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్ట్ చేసింది.భారతదేశంలో ఏడాది తర్వాత జరుగుతున్న మ్యాచులకు క్రికెట్ అభిమానులు ఆహ్వానించడం శుభ పరిణామంగా బీసీసీఐ అభివర్ణించింది.

Telugu Bcci, Gran, March, India-Latest News - Telugu

ఇకపోతే ఈసారి ఐపీఎల్ 2021 ఈవెంట్ ని ఇండియా లోనే కరెక్ట్ డేట్ కి నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది.ఫిబ్రవరి 18వ తేదీన బీసీసీఐ ఐపీఎల్ 2021 సీజన్ కి సంబంధించిన వేలంపాట చెన్నైలో ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube