ఆ తండ్రి కూతురును చూసి ఇప్పుడు ప్రపంచమే కన్నీరు పెడుతోంది... ప్రతి ఒక్కరిని కదిలిస్తున్న అగ్రరాజ్యం అమ్మాయి  

Emotional Texas Graduate Celebrations At Mexican Border-

అమెరికాలోని టెక్సాస్‌లోని ఒక కళాశాలలో హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాల పంపిణీ జరుగుతోంది.అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు.ప్రతి ఒక్కరు వారి వారి తల్లిదండ్రులతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.అందరూ కూడా ఎగిరి గంతేసి తమ గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయినట్లుగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Emotional Texas Graduate Celebrations At Mexican Border- Telugu Viral News Emotional Texas Graduate Celebrations At Mexican Border--Emotional Texas Graduate Celebrations At Mexican Border-

కాని సరాయి రూయిజ్‌ మాత్రం సంతోషంగా లేదు.అందరితో పాటే ఆమె కూడా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది, అందరిలాగే ఆమె కూడా పట్టా తీసుకుంది.

కాని ఆమె మొహంలో ఆనందం మాత్రం కనిపించడం లేదు.

Emotional Texas Graduate Celebrations At Mexican Border- Telugu Viral News Emotional Texas Graduate Celebrations At Mexican Border--Emotional Texas Graduate Celebrations At Mexican Border-

అందరు ఒకలా ఉంటే ఆమె మాత్రం చాలా దుఖంలో ఉంది.

ఎప్పుడైతే కార్యక్రమం పూర్తి అయ్యిందో అప్పుడే ఆమె అక్కడ నుండి పరిగెత్తడం మొదలు పెట్టింది.ఆమె పరిగెడుతూ ఉండటంను తోటి స్నేహితులు వీడియో తీశారు.

ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి టెక్సాస్‌ బోర్డర్‌ అవతలి వైపు ఉన్న ఒక వ్యక్తిని ఆలింగనం చేసుకుంది.ఆమె అతడి వద్ద కన్నీరు పెట్టుకుంది.అక్కడున్న వారికి అసలేం జరుగుతుందో అర్థం అవ్వడం లేదు.ఆ సంఘటన చాలా మంది వీడియోలు తీస్తున్నారు.కాన్వగేషన్‌ డ్రస్‌లో ఉన్న ఆ అమ్మాయి దేశ సరిహద్దు వద్ద ఎందుకు కన్నీరు పెట్టుకుంటుందా అని అంతా అనుకుంటున్నారు.ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

రూయిజ్‌ పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఆమె తండ్రిని కొన్ని పదుల సంవత్సరాల క్రితం అమెరికా దేశ బహిష్కరణ వేయడం జరిగింది.

దేశ బహిష్కరణ కారణంగా మెక్సికోలో ఉంటున్నాడు.అయితే ఆయన కూతురు మాత్రం అమెరికాలోనే టెక్సాస్‌లో చదువుతూ ఉంది.

ప్రతి రోజు మెక్సికో నుండి టెక్సాస్‌కు ఆమె వస్తుంది.గ్రాడ్యుయేషన్‌ డే రోజు తండ్రి కళాశాలకు రాలేక పోవడంతో ఆమె కన్నీరు ఆగలేదు.

అందుకే ఆమె కార్యక్రమం ముగిసిన వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రితో ఆనందాన్ని పంచుకుంది.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో రూయీజ్‌ తండ్రిపై ఉన్న దేశ బహిష్కరణ ఎత్తి వేయాలంటూ డిమాండ్‌ పెరిగింది.

ఆయన్ను మళ్లీ దేశంలోకి తీసుకు రావాలని అమెరికన్స్‌ పెద్దఎత్తున రూయీజ్‌కు మద్దతు తెలుపుతున్నారు.ఒక తండ్రి, కూతురు పరిస్థితిని అర్థం చేసుకుని వారిని తిరిగి సంతోషంగా గడిపేందుకు అతడిపై ఉన్న బహిష్కరణ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మొత్తానికి ప్రస్తుతం అగ్ర రాజ్యం ను ఈ అమ్మాయి కదిలిస్తోంది.

తాజా వార్తలు