మొసలితో స్నేహం... చూసేవాళ్లకి టెన్షన్

ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది.కొందరికి కుక్కలు పెంచడం అంటే ఇష్టం, కొందరికి పాములు పెంచడం అంటే ఇష్టం, మరికొందరికి క్రూరమృగాలు పెంచడం అంటే సరదా.

 Emotional Support Alligator Helps Pennsylvania Man Withdepression-TeluguStop.com

ఇలాంటి సరదాలు అప్పుడప్పుడు వార్తలలో ప్రముఖంగా నిలుచుంటాయి.ఇప్పుడు అలాంటి ఓ విచిత్రమైన ప్రాణిని పెంచుకుంటూ వార్తలలో నిలిచాడు.

పెన్సిల్వేనియాకు చెందిన జోయ్ హెన్నే అనే వ్యక్తి ఎంచక్కా మొసలిని పెంచుకుంటున్నాడు.దాంతో షికారుకి కూడా వెళ్తు ఉంటాడు.83 పదునైన పళ్లతో ఐదు అడుగుల పొడువు గల ఆ మొసలిని జోయ్ తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తుంటాడు.

హేన్నే ఆ మొసలిని చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి ఇంట్లోనే పెంచుకుంటున్నాడు, అయితే ఆ మొసలి ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదని అతను చెబుతున్నాడు.

ఆ మొసలికి మంచి డ్రెస్ వేసి డే కేర్ సెంటర్ కూడా అతను తీసుకెళ్తాడు.ఆ మొసలి అక్కడ అందరీతో బాగానే కలిసిపోతుందట.సుమారు 16 కిలోల బరువు ఉండే మొసలిని చిన్న పిల్లలను ఎత్తుకొని తిప్పినట్టు హెన్నే దాన్ని బయట తిప్పుతుంటాడని స్థానికులు చెప్పారు.ఇంట్లో కూడా మొసలిని బంధించకుండా ఫ్రీగానే వదిలేస్తాడట.

ఈ మొసలికి టీవీ చూడటం అంటే భలే ఇష్టమని హెన్నే చెప్పాడు.చివరకు పడుకునేటప్పుడు కూడా అతడితోపాటే ఉంటుంది.

ఇక దాని కోసం ప్రత్యేకంగా పూల్ కూడా కట్టాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube