కరోనా ప్రభావం జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్ పై పడిందా.. ఇప్పుడు ఎంత వస్తుందంటే?

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నటీనటులు జీవితాలు మారిపోయాయని చెప్పవచ్చు.వారానికి రెండు రోజులు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

 Emotional Comedians Fall On Remuneration How Much Is Coming Now-TeluguStop.com

ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమంలో పలు మార్పులు కూడా చోటుచేసుకున్నాయి.ముందుగా ఈ కార్యక్రమానికి జడ్జిగా నాగబాబు వ్యవహరించేవారు.

అదేవిధంగా చమ్మక్ చంద్ర టీమ్ లీడర్ గా ఉండేవారు.కొన్ని కారణాల వల్ల వీరిద్దరు జబర్దస్త్ కార్యక్రమం నుంచి పెళ్లి పోయినప్పటికీ ఈ కార్యక్రమం రేటింగ్స్ పడిపోకుండా ఉండటం కోసం నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు.

 Emotional Comedians Fall On Remuneration How Much Is Coming Now-కరోనా ప్రభావం జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్ పై పడిందా.. ఇప్పుడు ఎంత వస్తుందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమం నుంచి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది తమ కామెడీ ద్వారా అందరినీ ఆకట్టుకుంటున్నారు.

మరియు జబర్దస్త్ కార్యక్రమంలో చేసే కమెడియన్స్ నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.ముందుగా జడ్జీల విషయానికి వస్తే రోజా మొన్నటివరకు ఒక్కో ఎపిసోడ్ కు మూడు నుంచి నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వారు.

ప్రస్తుతం ఈమె రెమ్యూనరేషన్ డబుల్ అయింది.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా రోజా నెలకు 30 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ఇక మను గారికి ఒక్కో ఎపిసోడ్ కు 2 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.

Telugu Adhi, Adra Abhi, Anasuya, Bullet Bhasker, Comedy, Emotional, Jabardasth, Roja, Sudheer, Tollywood-Movie

అదేవిధంగా యాంకర్ అనసూయకి ఒక్కో ఎపిసోడ్ కు గతంలో 80 వేలు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం లక్ష దాటుతోంది అని చెప్పవచ్చు.ఇక యాంకర్ రష్మి ఒక్కో ఎపిసోడ్ కు లక్ష వరకు తీసుకుంటుంది.ఇక టీం లీడర్ ల విషయానికి వస్తే చమ్మక్ చంద్ర ఉన్నప్పుడు నెలకు మూడు నుంచి నాలుగు లక్షలు తీసుకునేవారు.ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్, హైపర్ ఆది కూడా లక్షలలో పారితోషికం తీసుకునే వారు.

గతంలో 3లక్షలు తీసుకొని సుధీర్ ప్రస్తుతం 4 తీసుకుంటున్నాడు.హైపర్ ఆది కూడా 2.5 నుంచి 3 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.అదిరే అభి 2 లక్షలు, రాకెట్ రాఘవ 2.75 లక్షలు, బుల్లెట్ భాస్కర్ 2 లక్షలు, చలాకి చంటి 2 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.అయితే కరోనా కారణం వల్ల వీరి పారితోషికాలను పెంచకుండా ఇవే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.

ఏడాది వరకు రెమ్యూనరేషన్ పెంచే ఆలోచనలో నిర్వాహకులు లేరని తెలుస్తోంది.ఏదిఏమైనా కరోనా ప్రభావం జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్ పై కూడా పడిందని చెప్పవచ్చు.

#Jabardasth #Emotional #Bullet Bhasker #Adhi #Sudheer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు