గత కొన్నివారాల నుంచి వర్ష ఇమ్మాన్యుయేల్ జోడీకి పాపులారిటీ భారీగా పెరుగుతోంది.ఈ జోడీ రియల్ జోడీ కాదని రీల్ జోడీ అని తెలిసినా ప్రేక్షకులను మాత్రం ఈ జోడీ ఆకట్టుకుంటోంది.
తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ఇమ్మాన్యుయేల్ వర్షపై వేసిన పంచ్ లు భలే పేలాయి.ప్రోమోలో వర్ష చెత్త ఏరుకునే అమ్మాయిలా కనిపించడం గమనార్హం.
చిరిగిన చొక్కా తొడుక్కుని వర్ష సాడ్ సాంగ్ తో ఎంట్రీ ఇస్తారు.
ఇమ్మాన్యుయేల్ మీరు ఇంత అందాన్ని పెట్టుకుని ప్లాస్టిక్ ఏరుకుంటున్నారా.? నన్ను నమ్మిరా నిన్ను పెద్ద హీరోయిన్ ను చేస్తానని వర్షకు చెబుతాడు.వర్ష ఇమ్మాన్యుయేల్ తో నేను పిచ్చిదాన్ని సార్ అని చెబుతుంది.
ఇమ్మాన్యుయేల్ నువ్వు పిచ్చిదానివని తెలుసమ్మా అందుకే నన్ను ప్రేమిస్తున్నావంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.ఇమ్మాన్యుయేల్ అలా చెప్పగానే స్కిట్ మధ్యలో వర్ష పడిపడి నవ్వుతారు.
ఆ తరువాత ఫహీమా బుల్లెట్ భాస్కర్ టీమ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.ఇమ్మాన్యుయేల్ ఇది హీరోయిన్ ఏంటండి అని చెప్పగా ఎక్స్ క్యూజ్ మీ యూ సీ మై ఒంపు సొంపు అంటూ ఫహీమా విచిత్రంగా డైలాగ్స్ చెబుతారు.
ఒంపు సొంపా ముందు కంపు కొడుతుంది వెళ్లి స్నానం చేసిరా అని ఇమ్మాన్యుయేల్ పంచ్ వేస్తాడు.ఒక మంచి హీరోయిన్ ను చూశానని ఇమ్మాన్యుయేల్ బుల్లెట్ భాస్కర్ కు చెప్పగా వర్ష ఎంట్రీ ఇస్తారు.
బుల్లెట్ భాస్కర్ డైలాగులు చెప్పడం ప్రారంభించగానే వర్ష ఏడుపు మొహం పెడుతుంది.వర్ష సరిగ్గా యాక్టింగ్ చేయకపోవడంతో బుల్లెట్ భాస్కర్ ఆమెను తోసేస్తాడు.జులై 23వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఈ ప్రోమోకు ఏకంగా 23 లక్షల వ్యూస్ రావడం గమనార్హం.