27 ఏళ్ల తర్వాత కోమా నుండి బయటకు వచ్చిన మహిళ.. ఆమె కొడుకు స్పందన ఏంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

బతకరు అని అనుకున్న మనుషులు చనిపోవడం, రేపో మాపో అనుకున్న వ్యక్తులు తిరిగి కోలుకోవడం మనం చాలా చూస్తూనే ఉంటాం.వైధ్యశాస్త్రం బాగా అభివృద్ది చెందిన కారణంగా ఎన్నో అద్బుతాలు ఆవిష్కారం అవుతున్నాయి.

 Emirati Woman Wakes Up From Stupor After 27 Years 27-TeluguStop.com

మనిషి చావు అనేది చేతిలో ఉండదు.పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోడ్డు మీదకు వెళ్లి తిరిగి వచ్చే వరకు నమ్మకం లేదు.

ఎందుకంటే ఏ ప్రమాదం ఆ మనిషిని లాగేస్తుందో, చంపేస్తుందో చెప్పలేం.అలాగే 27 క్రితం దుబాయ్‌కి చెందిన ఒక మహిళ యాక్సిడెంట్‌ కావడంతో కోమాలోకి వెళ్లింది.

ఆమె కుటుంబ సభ్యులు ఆమెను రక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు, చివరకు వారి ప్రయత్నం సఫలం అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… 1991లో మునీరా తన కొడుకు ఒమర్‌ను పాఠశాల నుండి తీసుకు వచ్చేందుకు స్కూల్‌ వద్దకు వెళ్లింది.

ఆ సమయంలో ఆమె వయసు 32 ఏళ్లు.తన అయిదు సంవత్సరాల కొడుకును వాహనంలో ఎక్కించుకుని మునీరా తిరిగి ఇంటికి బయలుజేరింది.ఆ సమయంలోనే ఆమె ప్రయాణిస్తున్న వాహనంను స్కూల్‌ బస్‌ బలంగా ఢీ కొట్టింది.ఆ సమయంలో ఒమర్‌ను మునీరా తన చేతులతో గట్టిగా పట్టేసుకుంది.

ఒమర్‌ను కాపాడిన మునీరాకు తీవ్ర గాయాలు అయ్యాయి.ఆ సమయంలోనే ఆమె కోమాలోకి వెళ్లిందని, బ్రెయిన్‌కు తీవ్ర గాయాలు అవ్వడం వల్ల ఆమె తిరిగి కోలుకోవడం అసాధ్యం అంటూ వైధ్యులు చెప్పారు.

దుబాయిలో మొదట కొన్నాళ్లు చికిత్స చేయించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ సాయంతో లండన్‌కు తీసుకు వెళ్లారు.లండన్‌లో కొంత కాలం చికిత్స చేయించారు.ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.దాంతో ఆమెను తిరిగి దుబాయి తీసుకు వెళ్లారు.అక్కడ మరి కొన్నాళ్లు చికిత్స చేయించారు.2017 సంవత్సరంలో జర్మనీలో చికిత్స చేయించేందుకు తీసుకు వెళ్లారు.అక్కడ ఆమెకు ఉన్నతమైన వైధ్యం అందించడంతో ఆమె క్యూర్‌ అయ్యింది.ఆమె మెల్ల మెల్లగా కదలికలు ఇచ్చింది.ఒక రోజు ఒమర్‌ అంటూ ఆమె నుండి పిలుపు వచ్చింది.అప్పుడు అక్కడే ఉన్న ఒమర్‌ తల్లి పిలుపుతో పులకరించి పోయాడు.

చిన్న పిల్లాడు అయిన ఒమర్‌ పెద్ద వాడు అయ్యాడు.అమ్మ పిలుపుతో కన్నీరు పెట్టుకుని, ఈ పిలుపు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను అన్నాడు.

ప్రస్తుతం మునీరా 75 శాతం వరకు కోలుకుందని, రోజుకు రెండు పూటల ఫిజియో చేయించడంతో పాటు, ఆమెకు ఇంకా చికిత్స అందిస్తున్నట్లుగా ఒమర్‌ చెప్పుకొచ్చాడు.ప్రస్తుత పరిస్థితులు, మారిపోయిన విధానాలు చూసి అమ్మ ఆశ్చర్య పోతుందని ఒమర్‌ ఆనందంతో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube