ఎనిమిదేళ్ళ బాలుడు దుబాయ్ లో సెన్సేషన్ అయ్యాడు! ఎలా అంటే

అప్పుడప్పుడు కొంత మంది చేసే పనులు వారిని రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మార్చేస్తాయి.సోషల్ మీడియాలో ఎక్కడ లేని క్రేజీ తీసుకొస్తాయి.

 Emirati Boy Omar Mohammad Al Hajjaj From Dubai Became An Overnight Sensation-TeluguStop.com

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది తమ టాలెంట్ ని చూపించుకుంటూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.ఇలా ఇండియాలో రాత్రికి రాత్రి సంచలనంగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు.

అయితే వేగంగా వచ్చే ఇమేజ్ అంతే వేగంగా పోయే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే దుబాయ్ లో ఓ ఎనిమిదేళ్ళ బాలుడు రాత్రికి రాత్రి సెన్సేషనల్ అయిపోయాడు.

అయితే అతను ఏదో టాలెంట్ చూపించి సోషల్ మీడియాలో క్రేజీగా ఫేమస్ కాలేదు.అతను ఆలోచన, సేవా దృక్పథం అతనిని దుబాయ్ హీరోని చేసాయి.

క్యాన్సర్ రోగులు కీమో థెరపీ తర్వాత జుత్తుకి కోల్పోతూ ఉంటారు.అలాంటి వారు క్యాన్సర్ నయం అయిన తర్వాత ట్ ఇరిగి జుట్టు పొందడానికి చాలా ప్రయత్నం చేస్తారు.

ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న ఓమర్ మహ్మద్ ఆల్ హజ్జాజ్ అనే బాలుడు తన మూడో ఏట నుంచి తల వెంట్రుకలు పెంచుతూ వాటిని చారిటీకి ఇస్తూ క్యాన్సర్ రోజులకి తన వంతు సాయం చేస్తూ వస్తున్నాడు.ఇలా ఈ బాలుడు సేవా దృక్పథం గురించి తెలుసుకున్న దుబాయ్ రాజు ఓమర్‌కు ఆల్ బతీన్ ప్యాలెస్‌ కి పిలిపించుకున్ననారు.

ప్యాలెస్‌లో దుబాయి అధినేత షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం.అబుదాబి రాజు, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లను ఓమర్ కలుసుకున్నాడు.

ఓమర్ మహ్మద్ ఆల్ హజ్జాజ్ వారందరితో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మనోడు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube