గిన్నీస్‌ రికార్డు సొంతం చేసుకున్న సుశీలమ్మ

గాన కోకిల సుశీలమ్మ గారికి అరుదైన గౌరవం దక్కింది.ప్రపంచంలో అత్యధికంగా పాటలు పాడి, అత్యధిక భాషలో పాడినందుకు గాను సుశీలమ్మ గారికి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు దక్కింది.

 Eminent Singer P Susheela Enters Guinness Book Of World-TeluguStop.com

ఈ అరుదైన ఘనత దక్కించుకున్న సుశీలమ్మ గారు తెలుగు వారు కావడం తెలుగు వారి అందరికి గర్వకారణం.ఇప్పటి వరకు దాదాపు 40 వేల పాటలు పాడినప్పటికి గిన్నీస్‌బుక్‌ వారు మాత్రం ఈమె పాడిన 17,695 పాటలను గుర్తించి, ఈ అద్వితీయ రికార్డును ఆమెకు కట్టబెట్టారు

తాజాగా గిన్నీస్‌బుక్‌ ప్రతినిధులు సుశీలమ్మను కలిసి గిన్నీస్‌బుక్‌ రికార్డు ఇస్తున్నట్లుగా సర్టిఫికెట్‌ను ఆమెకు ఇవ్వడం జరిగింది.సుశీలమ్మ గారి పూర్తి పేరు పూలపాక సుశీల.1935లో జన్మించిన సుశీల గారు 1960వ సంవత్సరం నుండి పాటలు పాడటం ప్రారంభించారు.అప్పటి నుండి ఇప్పటి వరకు పాడుతూనే ఉన్నారు.ఆరు భాషల్లో ఈమె పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సందర్బంగా సుశీల గారికి తెలుగుస్టాప్‌ తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.ఆమె మరిన్ని పాటలు పాడి తెలుగు వారిని మెప్పించాలని కోరుకుంటున్నాము.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube