మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారి అధ్యక్షతన అత్యవసర సమావేశం

మాల మహానాడు జాతీయ కార్యాలయం హైదరాబాద్ లో జాతీయ అధ్యక్షుడు (మాల మహానాడు) చెన్నయ్య గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం జరిగినది.ఈ సమావేశంలో వర్గీకరణ – మాల మహానాడు ఉద్యమ పంథా గురించి మరియు రాష్ట్ర జాతీయ స్థాయిలో మాలల మరియు దళితుల పరిస్థితి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు.

 Emergency Meeting On Behalf Of Malamahaanadu National President Chennaiah Detail-TeluguStop.com

వర్గీకరణ పేరుతో దళితులను పార్టీలు విభజించాలని చూస్తున్నాయి.

వర్గీకరణను సమర్ధించే పార్టీలను మాలలు, మాల మహానాడు గుణపాఠం చెప్తాయని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

దళితుల సంక్షేమాన్ని గాలికి వదిలివేసిన ప్రభుత్వాలు వర్గీకరణ నాటకం ఆడుతూ దళితులను రాజ్యాధికారానికి దూరం చేసే కుట్రగా భావిస్తున్నామని, దళితులను రాజ్యాధికారం వైపు నడిపించడానికి జాతీయ స్థాయిలో ఉద్యమ నిర్మాణం చేయడానికి మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర డెలిగేట్ మీటింగ్ తేదీ 29-10 2021 రోజు ఉదయం 10:00 గంటలకు అంబేద్కర్ భవన్, లోయర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు, ఇట్టి సమావేశానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలనీ చెన్నయ్య గారు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు మేక వెంకన్న గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి గారు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్ గారు, యువత అధ్యక్షుడు జి రమేష్ గారు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube