వర్షను పెళ్లి చేసుకున్నానని చెప్పిన ఇమ్మాన్యుయేల్.. లాక్ డౌన్ లో జరిగిందంటూ?

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ లో వర్ష, ఇమ్మాన్యుయేల్ కలిసి చేసే స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.వినాయక చవితి పండుగ స్పెషల్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ఆ ప్రోమో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.

 Emanuel Shocking Comments About Varsha In Jabardasth Show, Emmanuel, Jabardasth-TeluguStop.com

బుల్లెట్ భాస్కర్ ఈరోజు వినాయక చవితి వినాయకుడిని ఏది కోరుకుంటే అది జరుగుతుందని చెబుతాడు.ఫహీమా నాకు ఇప్పుడిప్పుడే మంచి బ్రేక్ వచ్చిందని బుల్లెట్ భాస్కర్ తీసే ఫలక్ నామా ఫహీమా అని ఒక టీమ్ ఇచ్చేయాలని కోరుతుంది.

ఫహీమా కోరికను విని షాకవ్వడం బుల్లెట్ భాస్కర్ వంతవుతుంది.ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ అందరూ బాగుండాలి మన టీమ్ మాత్రం ఉండాలని చెబుతాడు.స్కిట్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్ లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్నానని ఎవరికీ చెప్పలేదని బుల్లెట్ భాస్కర్ చెబుతాడు.ఇమ్మాన్యుయేల్ తాను కూడా పెళ్లి చేసుకున్నానని ఎవరికీ చెప్పలేదని వెల్లడిస్తాడు.

ఆ తర్వాత వర్షను తాను లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్నానంటూ ఇమ్మాన్యుయేల్ బుల్లెట్ భాస్కర్ కు పరిచయం చేస్తాడు.

యావరేజ్ గా ఉండే తానే వర్ష లాంటి అందగత్తెను చేసుకున్నానంటే అందంగా ఉండే నువ్వు ఎలాంటిదాన్ని చేసుకున్నావో.? అని ఇమ్మాన్యుయేల్ కామెంట్ చేస్తాడు.ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ భార్యగా ఫహీమా ఎంట్రీ ఇవ్వగా పింఛన్ కోసం ఎమ్మెల్యే గారి ఇంటికి వస్తావా.? ఆఫీస్ కు వెళ్లి అడుగు అని ఫహీమాను చూసి ఇమ్మాన్యుయేల్ కామెంట్ చేస్తాడు.

ఆమె పింఛన్ కోసం రాలేదురా నా భార్య ని బుల్లెట్ భాస్కర్ చెప్పడంతో షాకవ్వడం ఇమ్మాన్యుయేల్ వంతవుతుంది.సుడిగాలి సుధీర్ టీమ్ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తూ చేసిన స్కిట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.బాబా భాస్కర్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి అదిరిపోయే పంచ్ లు వేసి నవ్వించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube