బుల్లితెర జోడీల విషయంలో అభిమానులను ఎప్పుడూ ఒకింత కన్ఫ్యూజన్ నెలకొని ఉంటుంది.ఆ జోడీల లవ్ ట్రాకులు నిజమో కాదో ఎవరికీ అర్థం కాదు.
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న ఈ జోడీ ఇతర షోలలో, ఈవెంట్లలో కూడా పాల్గొంటున్నారు.యాంకర్ సుమ స్టార్ మా ఛానెల్ లో గత కొన్ని నెలలుగా గతంలో కొంతమంది యాంకర్లు చేసిన స్టార్ట్ మ్యూజిక్ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ షోకు వర్ష ఇమ్మాన్యుయేల్ గెస్టులుగా హాజరు కాగా సుమ ఇమ్మాన్యుయేల్ వర్షకు విచిత్రమైన పరీక్ష పెట్టారు.ఇమ్మాన్యుయేల్ , వర్ష మధ్య ఏం ఉందో తేల్చాల్సిన సమయం వచ్చిందని వర్ష బుగ్గపై ఇమ్మాన్యుయేల్ ముద్దు పెట్టాలని సుమ టాస్క్ ఇస్తారు.
అయితే ప్రోమోలో సుమ వర్ష ఇమ్మాన్యుయేల్ ను దారుణంగా ఇరికించగా ఇమ్మాన్యుయేల్ నిజంగా ముద్దు పెట్టాడో లేదో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.
వర్ష ఇమ్మాన్యుయేల్ కు సంబంధించిన ప్రోమోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.సుమ అలా చెప్పగానే వర్ష తెగ సిగ్గు పడగా ప్రోమోలతోనే షోలపై అంచనాలను పెంచడంలో సుమ సక్సెస్ అయ్యారు.జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, మరికొన్ని షోలలో వర్ష ఇమ్మాన్యుయేల్ సందడి చేస్తున్నారు.
వర్ష ఇమ్మాన్యుయేల్ కలిసి పాల్గొన్న షోలకు మంచి రేటింగ్ లు వస్తున్నాయి.
గతంలో పలు సందర్భాల్లో వర్ష ఇమ్మాన్యుయేల్ పై ఉన్న ఇష్టాన్ని వెల్లడించారు.
సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు సమాచారం వైరల్ అయితే ఇమ్మాన్యుయేల్ కాల్ చేసి తన క్షేమ సమాచారాన్ని కనుక్కున్నాడని వర్ష చెప్పుకొచ్చారు.బుల్లితెరపై ఆఫర్లు సొంతం చేసుకుంటున్న ఈ జోడీ భవిష్యత్తులో వెండితెరపై కూడా ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.