ఏలూరు యాసిడ్ దాడి బాధితురాలు యడ్ల ఫ్రాంచిక (35) హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది.ఏలూరు విద్యానగర్ లో నివాసముంటున్న యడ్ల ఫ్రాంచిక.
దుగ్గిరాల సమీపంలో దంత వైద్య కళాశాలలో రిసెప్షనిస్టుగా పనిచేస్తుంది.ఆమె భర్త రాజమండ్రిలో కెమికల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.
ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకోగా గొడవలు రావడంతో.రెండేళ్ల నుండి భర్తతో విడిపోయి తన ఐదేళ్ల చిన్నారితో ఏలూరు విద్యానగర్ నందు తల్లిదండ్రులతో యడ్ల ఫ్రాంచిక నివాసం ఉంటుంది.
అయితే గత మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా… ఇంటికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు.ఫ్రాంచికపై యాసిడ్ దాడి చేయడం జరిగింది.
ఆ సమయంలో తల, ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే ఆమె పరుగులు తీస్తూ ఇంటికి రాగా కుటుంబ సభ్యులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ నుండి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అనంతరం అక్కడ నుండి మణిపాల్ ఆసుపత్రికి తరలించగా… అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు యడ్ల ఫ్రాంచిక మృతి చెందడం జరిగింది.ఇదిలా ఉంటే ఈ దాడి ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు.
కూతురు చనిపోవడంతో మనవరాలు అనాధ కావడంతో.యడ్ల ఫ్రాంచిక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.