ఎలాన్ మస్క్‌ ట్వీట్ దెబ్బకి ఆ కంపెనీ షేర్..?!

Elon Musk Tweet Blows Up The Share Value Of Etsy Company, Elon Mask, Viral Tweet, Tesla , Viral News, Helmet, Etsy, Share Value, E Commerce, Website

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా అధినేత మస్క్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.ఇటీవల కాలంలో అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పెఎస్ ఎక్స్, విద్యుత్ వాహనాల టెస్లా సంస్థల నుంచి ఇప్పటి వరకు ఎవరూ సాధ్యం కానీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు ఎలాన్.

 Elon Musk Tweet Blows Up The Share Value Of Etsy Company, Elon Mask, Viral Tweet-TeluguStop.com

అంతేకాకుండా ఎలాన్  సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికి అప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలో తాజాగా ఎలాన్ పోస్ట్ చేసిన ట్వీట్ లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి అంటే నమ్మండి.

తాజాగా ఒక కంపెనీ గురించి వివరిస్తూ ఎలాన్ చేసిన ట్వీట్ ఆ కంపెనీ వారికి వాణిజ్యపరంగా ముందుకు కొనసాగేలాగా చేసింది.అంతేకాకుండా ఎలాన్ చేసిన ట్వీట్ తర్వాత ఆ కంపెనీ షేరు విలువ ఒక్కసారిగా మార్కెట్లో దూసుక పోవడంతో పాటు, కంపెనీపై కాసుల వర్షం కురిసింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఎలాన్ తన పెంపుడు కుక్క కొరకు ఇట్సీ అనే ఈ-కామర్స్ వెబ్ సైట్ ద్వారా ఉన్నితో తయారు చేయించిన మార్షియల్ హెల్మెట్ ను ఆర్డర్ ఇచ్చాడు.

అనంతరం ఆ ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత మార్షల్ హెల్మెట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఇట్సీ అంటే నాకు చాలా ఇష్టమని ఆయన తెలియజేశారు ఎలాన్.దీనితో ఒక్కసారిగా ఆ కంపెనీ షేరు ధర మార్కెట్ లో దూసుకుపోయింది.

ఇంట్రాడే ట్రేడింగ్ లో కూడా రికార్డు స్థాయిలో షేర్ల ధర 8 శాతానికి పెరిగాయి.

ఇందుకు కంపెనీ వారు స్పందిస్తూ మీరంటే మాకు చాలా ఇష్టం అంటూ వారి ఆనందాన్ని వ్యక్తం చేసింది.అంతేకాకుండా ఆ కంపెనీకు అంతకంటే ముందే మార్కెట్ లో తనదైన గుర్తింపు ఉంది.ఆ వెబ్ సైట్ ద్వారా ఎక్కువగా చేనేత కళాకారుల వారి వస్తువులను అమ్మడానికి మొగ్గుచూపుతారు.

మరో విషయం ఏమిటి అంటే.అందులో ఎక్కువ శాతం మహిళలే ఉండడం గమనార్హం.

మరోవైపు ఎలాన్ షేర్ చేయడం ద్వారా ఎన్నడూ లేనంత విధంగా ఇట్సీకి  పాపులారిటీ వచ్చింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube