నిజంగానే "ఇస్మార్ట్" న్యూస్... మనిషి మెదడులో చిప్....

ఇస్మార్ట్ న్యూస్ ఏంటి అని అనుకుంటున్నారా.మనిషి మెదడులో కంప్యూటర్ చిప్ ల ను అమర్చడం వంటి విషయాల గురించి మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం.

 Elon Musk's Neuralink Venture Unveils Pig With Computer Chip In Brain, Elon Musk-TeluguStop.com

ఆ మధ్య పూరి జగన్నాథ్,హీరో రామ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చూసే ఉంటారు.ఆ సినిమా లో కూడా హీరో రామ్ మైండ్ లో ఒక మిషన్ సాయం తో చిప్ ను అమర్చిన విషయం విదితమే.

అయితే ఆ చిత్రం అందరికీ తెగ నచ్చేసి పెద్ద హిట్ కూడా కొట్టింది.అయితే ఇలాంటి వన్నీ కూడా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం.

కానీ నిజ జీవితం ఇలాంటి చిప్ ల గురించి ఎప్పుడూ కూడా విని ఉండరు.కానీ నిజంగా ఈ కాన్సెప్ట్ ను నిజం చేస్తూ ప్రముఖ వ్యాపార వేత్త,బిలియనీర్ ఎలన్ మాస్క్ అద్భుతం సృష్టించారు.

న్యూట్రాలింక్ పేరుతో న్యూరోసైన్స్ స్టార్టప్‌ ప్రారంభించిన ఎలన్‌మస్క్ శుక్రవారం ఓ పంది బ్రెయిన్‌లో తొలిసారిగా ఈ ప్రయోగాన్ని చేశారు.నాణెమంత సైజు ఉన్న కంప్యూటర్ చిప్ అమర్చారు.

ఈ చిప్ పంది మెదడులో 2 నెలలపాటూ ఉంటుంది.పందికి ఉన్న రకరకాల అనారోగ్యాల్ని సరిచెయ్యాలన్నది ఈ చిప్ అసలు ఉద్దేశం.ఇది సక్సెస్ అయితే… మనుషుల మెదడుల్లో కూడా చిప్ పెట్టి రకరకాల అనారోగ్య సమస్యలు అంటే అల్జీమర్స్, డైమెన్షియా, వెన్నెముక వంటి సమస్యల్ని సరిచేయాలన్న ఉద్దేశం తో మాస్క్ ముందుకు వెళుతున్నారు.2016లో శాన్‌ఫ్రాన్సిస్కో‌లో ఎలన్‌మస్క్ సహ వ్యవస్థాపకుడిగా ఈ న్యూట్రాలింక్ కంపెనీ ఏర్పాటైన విషయం విదితమే.ఇది వైర్ లెస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను బ్రెయిన్‌లో సెట్ చేయగలదు.ఇప్పటికే… స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీలకు సీఈఓగా ఉన్న ఎలన్‌మస్క్.మార్స్ గ్రహానికి వన్ వే ట్రిప్పులో మనుషుల్ని పంపాలన్నది ఆయన ఆలోచన.అందుకే దానికి తగిన రాకెట్లను తయారుచేస్తున్నారు.తాజాగా ఈ న్యూట్రాలింక్ సంస్థకు కూడా భారీ మద్దతు లభిస్తుంది.ఇప్పటి వరకు ఫండ్ రూపంలో రూ.1155 కోట్లు ఆ సంస్థకు వచ్చినట్లు తెలుస్తుంది.

అయితే ఈ ఫండ్ లో ఒక్క ఎలన్‌మస్కే స్వయంగా రూ.731కోట్లు ఇవ్వడం గమనార్హం.అయితే ఈ చిప్‌ని మనుషుల మెదడుల్లో పెట్టేందుకు ఈ సంవత్సరం చివరి నాటికి లైసెన్స్ పొందుతామని ఎలన్‌మస్క్ తెలిపారు.

అయితే మరో విషయం ఏంటంటే ఒక వేళ ఆ చిప్ అవసరం లేదు అనుకున్నప్పుడు దాన్ని బ్రెయిన్ నుంచి తీసివేసేందుకు కూడా వీలు ఉంటుందట.నిజంగా ఇలాంటి అద్భుతమైన విషయాలను వింటుంటే ఎవరికైనా ఒక సంతోషంతో కూడిన ఆశ్చర్యం కలగక మానదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube