బీచ్‌లో ఎలాన్ మస్క్, జుకర్‌బర్గ్.. అసలు విషయం ఇదే!

Elon Musk, Zuckerberg On The Beach.. This Is The Real Thing, Elon Musk, Zuckerberg , The Beach, This Is The , Real Thing, Threads, Social Media, Meta, Twitter

ప్రపంచ దిగ్గజ వ్యాపార వేత్తలు ఎలాన్ మస్క్, జుకర్‌బర్గ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.వాళ్లలో ఒకరు ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ అయితే, మరొకరు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్.

 Elon Musk, Zuckerberg On The Beach.. This Is The Real Thing, Elon Musk, Zuckerb-TeluguStop.com

వీరిద్దరూ వ్యాపార పరమైన పోటీతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వుంటారు.ఇటీవలే కేజ్‌ ఫైట్‌కు సై అంటే సై అంటూ ఇద్దరూ ప్రతిస్పందించిన తీరు సోషల్‌ మీడియాలో పెను దుమారాన్ని సృష్టించిన సంగతి విదితమే.

ట్విటర్‌కు పోటీగా జుకర్‌బర్గ్‌( Zuckerberg ) థ్రెడ్స్‌ను తీసుకు రావటం వివాదాన్ని రాజేసింది.పైగా ట్విటర్‌ వ్యాపార రహస్యాలు, ఇతర మేధో సంపత్తిని చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేశారని మస్క్‌ ఆరోపించడంతో ఇద్దరి మధ్య వార్ పీక్స్ కి చేరింది.

ఇలా ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నడుస్తున్న సమయంలో వాళ్లిద్దరూ బీచ్ లో కలిసి చక్కెర్లు కొడుతున్న పోటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అవడంతో నెటిజన్లు అవాక్కవుతున్న పరిస్థితి.అవును, ఇద్దరికీ ఒకరంటే ఒకరు పడనప్పుడు ఆ ఇద్దరూ కలిసి ఫొటోలు ఎలా దిగరా? అనే అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారు.విషయం ఏమంటే, వాళ్లిద్దరూ కలిసి ఫొటోలు ఎక్కడా దిగలేదు.కానీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో ఓ ట్విటర్‌ యూజర్‌.వాళ్లిద్దరూ కలిసి దిగినట్టుగా ఫొటోలు సృష్టించాడు.ఆ ఫొటోలకు ఇంగ్లిష్‌లో ‘గుడ్‌ ఎండింగ్‌‘ అనే క్యాప్షన్‌ జోడించి ట్విటర్‌లో షేర్‌ చేయగా ఆ ఫోటోలు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి.

ఆ ఫొటోల్లో మస్క్‌, జుకర్‌బర్గ్‌ ఇద్దరూ బీచ్‌లో ఓ జంట ఫోటోషూట్‌లో పాల్గొన్నట్లుగా కనబడుతోంది.

ఈ బిలియనీర్లిద్దరూ బీచ్‌లో కలిసి నడుస్తున్నట్టుగా ఒక ఫోటో, ఒకరిని ఒకరు కౌగిలించుకున్నట్లుగా మరో ఫోటో, ఇద్దరూ కలిసి బీచ్‌లో పరుగులు తీస్తూ ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా మరో ఫోటో క్రియేట్‌ చేసి ట్విటర్‌ యూజర్‌ ఆ ఫొటోలను చేశాడు.ఈ ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేసిన కొద్దిసేపటికే 90 లక్షల మంది వీక్షించడం కొసమెరుపు.అంతేకాకుండా లక్ష మందికి పైగా దానిని లైక్‌ చేయడం విశేషం.

ఇక ఈ ఫొటోలు వైరల్‌ కావడంతో ఎలాన్‌ మస్క్‌ కూడా స్పందించడం ఇపుడు హాట్ టాపిక్ అయింది.అవును, దానిని ఆయన నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు.కాగా ఈ ఫొటోలపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్‌ చేయడం ఇక్కడ చూడవచ్చు.“వాస్తవానికి వాళ్లు మీమ్స్ కోసం ఇలా కలిసి ఫోటోషూట్ చేయాలి” అని కొందరు కామెంట్ చేస్తే, “వావ్‌ బ్యూటిఫుల్ కపుల్స్” అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube