సొంత ఇంటి కల నెరవేర్చుకొండి... అది కూడా అంగారక గ్రహంపై  

Elon Musk Says He Plans To Send 1 Million People To Mars-mars,plans To Send 1 Million People,space X

దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు చంద్రుడు, అంగారక గ్రహాల మీద పరిశోధనలు చేస్తూ విశ్వంలో భూమి మాత్రమే కాకుండా నివాస యోగ్యం అయిన గ్రహాలలు ఉన్నాయా అనే కోణంలో పరిశోధనలు చేస్తున్నాయి.దీనికోసం ర్యాకెట్ లని ఇతర గ్రహాల మీదకి పంపించి అక్కడ జీవ ఉనికి, నీరు, ఆక్సిజన్ లని గుర్తించే పని చేపడుతున్నాయి.

Elon Musk Says He Plans To Send 1 Million People Mars-Mars Plans Space X

అయితే కొన్ని దేశాలు త్వరలో చంద్రుడు మీదకి మనిషిని పంపిస్తామని చెబుతున్నాయి.అక్కడ ఫ్లాట్ లు అమ్ముతామని వాటికి బుక్ చేసుకోవాలని ఆన్ లైన్ లో ఆర్డర్ కూడా పెడుతున్నాయి.

అలాగే అంగారక గ్రహం మీద కూడా పరిశోధనలు చేసి మానవ సహిత ర్యాకెట్ లని పంపించే ప్రయత్నం చేస్తున్నారు.ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందో తెలియదు కాని స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మాస్క్ అదిరిపోయే ఆఫర్ ని ప్రకటించాడు.

అంగారక గ్రహంపైకి వెళ్లి సెటిలవ్వాలని అనుకుంటున్న, అక్కడ ఉద్యోగం చేయాలనుకున్న వెంటనే తమని సంప్రదించాలని చెబుతున్నారు.అక్కడ ప్రజల నివాసం కోసం ఓ సిటీని కట్టబోతున్నారట.

దాదాపు10 లక్షల మందికి సరిపోయేంత ఆ సిటీని 2050 నాటికి సిద్ధం చేసి, మనుషులను తరలిస్తామని చెబుతున్నారు.అలాగే అ సిటీలో ప్రజలకి ఉద్యోగాలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.

ట్విటర్‌‌లో వరుస ట్వీట్లతో ఎలాన్ మస్క్ ఈ సంగతులు వెల్లడించారు.మనుషులను మార్స్ పైకి పంపేందుకు ప్రతి ఏడాది 100 కొత్త స్టార్ షిప్‌‌లు తయారు చేస్తున్నట్లు తెలిపారు.

మొత్తంగా పదేళ్లలో వెయ్యి స్టార్ షిప్‌‌లు సిద్ధం చేసి రీయూజబుల్ రాకెట్లతో కూడిన ఈ స్టార్ షిప్ లు ప్రతి రోజూ మూడు చొప్పున మార్స్ కు బయలుదేరుతాయని కూడా తెలిపారు.ప్రతి 26 నెలలకు ఓ విడతలో వెయ్యి స్టార్ షిప్ ట్రిప్‌‌లు ఉంటాయని ప్రకటించారు.

అంగారకుడుని 2050 నాటికి అంగారక గ్రహాన్ని పూర్తిగా నివాస యోగ్యం క్రింద తయారు చేయబోతున్నట్లు తెలిపారు.

.

తాజా వార్తలు

Elon Musk Says He Plans To Send 1 Million People To Mars-mars,plans To Send 1 Million People,space X Related....