మెదడులో కంప్యూటర్ చిప్ చొప్పించేందుకు ఎలాన్ మస్క్ రెడీ.. ఆశ్చర్యపోతున్న యావత్‌ప్రపంచం..!

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ 2017 సంవత్సరంలో న్యూరాలింక్‌ అనే ఒక స్టార్టప్ కంపెనీ స్థాపించిన విషయం తెలిసిందే.ఈ కంపెనీ ద్వారా ఆయన మానవుల మెదడులో జొప్పించే న్యూరాలింక్‌ బ్రెయిన్ చిప్ తయారు చేయడానికి కసరత్తులు చేస్తున్నారు.

 Elon Musk Is Ready To Insert A Computer Chip In The Brain  The World Is Always-TeluguStop.com

ఈ బ్రెయిన్ చిప్ పుర్రెలోకి జొప్పించి అన్ని వస్తువులను రిమోట్ కంట్రోల్ చేసేలా మనుషులకు అద్భుతమైన శక్తిని అందించాలని ఎలాన్ మస్క్ కృషి చేస్తున్నారు.మెదడులో నాడీ కణాల మధ్య అమర్చే ఈ చిప్ వ్యాసం 8 మిల్లీమీటర్లు ఉంటుంది.

మన వెంట్రుకల్ని 20 భాగాలు చేస్తే అందులో ఒక భాగమంత సైజులో ఈ చిప్ లోని ఎలక్ట్రోడ్లు ఉంటాయి.దీని ద్వారా మనం యంత్రాలతో కనెక్ట్ కావచ్చు.అయితే తాజాగా ఈ ప్రాజెక్టులో చివరి అడుగు పడింది.‘బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌’ (బీసీఐ) టెక్నాలజీ మానవులపై ప్రయోగించే దశకు చేరుకుందని తాజాగా న్యూరాలింక్‌ సంస్థ వెల్లడించింది.ఈ విషయం తెలిసి యావత్‌ ప్రపంచం ఆశ్చర్యపోతోంది.

ఈ కంప్యూటర్ బ్రెయిన్ చిప్ సహాయంతో మానవులు అతీతమైన శక్తులు సాధిస్తారని ఎలాన్ మస్క్ చెబుతున్నారు.అలాగే నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్లు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను మళ్లీ క్రియాశీలకంగా మార్చొచ్చట.అయితే ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీ ఇప్పుడు మానవులపై ప్రయోగించే దశకు చేరుకోగా… న్యూరాలింక్‌ సంస్థ కెమికల్ డైరెక్టర్ ని నియమించేందుకు కసరత్తు మొదలెట్టింది.

దీన్నిబట్టి త్వరలోనే బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ (బీసీఐ) టెక్నాలజీని మనుషులపై ప్రయోగించడం మరెన్ని రోజుల్లోనే లేదని చెప్పొచ్చు.

మన శరీరంలోని అన్ని అవయవాల పనితీరును మెదడు కంట్రోల్ చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే.నిజానికి ఈ మెదడులోని న్యూరాన్లు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పంపుతూ, రిసీవ్ చేసుకుంటూ ఈ పనులను నిర్వర్తిస్తుంటాయి.ఇలాంటి నాడీకణాలతో బ్రెయిన్ చిప్ లోని ఎలక్ట్రోడ్లను కనెక్ట్ చేయాలని భావిస్తున్నారు.

ఇలా కనెక్ట్ చేయడం ద్వారా నాడీ సంబంధిత వ్యాధులను నయం చేయవచ్చు.మెదడు చాలా సున్నితమైనది కాబట్టి దీనిని ఒక రోబో ద్వారా చాలా జాగ్రత్తగా మెదడులో అమర్చుతారు.

న్యూరోసర్జరీతో ఇంప్లాంట్ చేసే ఈ ప్రక్రియ గంటసేపు సాగుతుంది.అయితే ఇది రీఛార్జబుల్ బ్యాటరీ సాయంతో పని చేస్తుంది.

వైర్‌లెస్‌ పద్ధతిలో ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవుతుంటుంది.దీని ద్వారా మనుషులు ఆలోచనలతోనే ఫోన్ చేయొచ్చు, అలాగే సంగీతం కూడా వినొచ్చు.

అలాగే మిగతా పనులన్నీ కూడా చేసుకోవచ్చు.జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకొని భద్రంగా దాచుకోవచ్చు.

వాటిని మళ్లీ అవసరమైనప్పుడు ఈజీగా యాక్సెస్ చేయవచ్చు.బ్రెయిన్ చిప్ ను ఇప్పటికే పంది వంటి జంతువు లపై విజయవంతంగా పరీక్షించారు.

ఇప్పుడు ఏకంగా మానవులపై ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు.

Elon Musk Is Ready To Insert A Computer Chip In The Brain The World Is Always Amazed, Elan Mask, Latest News, Brain, Computer, Technology Updates, - Telugu Brain, Elan, Latest, Ups #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube