పెర్‌ఫ్యూమ్‌ బిజినెస్‌లో ఎలాన్ మస్క్.. ఒక్కో బాటిల్ ధర ఎంత అంటే..?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికే టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీలను స్థాపించారు.ట్విటర్‌ కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ బిలియనీర్ ఒక పెర్‌ఫ్యూమ్‌ బిజినెస్‌లోకి అడుగు పెట్టారు.Burnt Hair బ్రాండ్‌ పేరుతో ఇప్పటివరకు ఎవరూ తయారు చేయని పెర్‌ఫ్యూమ్‌ అమ్మడం ప్రారంభించారు.

ఈ పెర్‌ఫ్యూమ్‌ సరికొత్త సువాసనను అందిస్తుందన్నారు.కొద్ది గంటల క్రితమే ఈ వరల్డ్ చేంజర్ ట్వీట్ చేస్తూ దయచేసి, నా పెర్‌ఫ్యూమ్‌ కొనండి, తద్వారా నేను ట్విట్టర్‌ని కొనుగోలు చేయగలను.

ఇప్పుడు నేనొక పెర్‌ఫ్యూమ్‌ సేల్స్‌మన్‌ని అంటూ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.అంతేకాదు తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ బర్న్ట్‌ హెయిర్ సెంట్ బాటిల్ ఫొటో కూడా షేర్ చేశారు.

Advertisement

ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పరిమళాన్ని ఈ బాటిల్ అందిస్తుంది అంటూ పేర్కొన్నారు.అడ్వాన్స్‌డ్‌ ట్రావెల్ టెక్నాలజీ, దాని సొల్యూషన్స్‌ కోసం మస్క్‌ బోరింగ్‌ కంపెనీని స్థాపించిన విషయం తెలిసిందే.

ఈ బోరింగ్‌ కంపెనీ ఈ నయా పెర్‌ఫ్యూమ్‌ బాటిల్‌ను తాజాగా రిలీజ్ చేసింది.ఈ పెర్‌ఫ్యూమ్‌ బిజినెస్‌లోకి అరంగేట్రం చేయడం తనకు తప్పనిసరి అయ్యిందని ట్విటర్‌లో మస్క్ చెప్పడం కూడా ఇప్పుడు పలు చర్చకు దారితీస్తోంది.

అయితే దీనిని తీసుకొచ్చిన కొంత సమయం లోనే 10,000కు పైగా బాటిళ్లు సేల్ అయినట్టు మస్క్ వెల్లడించారు.బోరింగ్‌ కంపెనీ వెబ్‌సైట్‌లో పెర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌ను మస్క్ విక్రయిస్తున్నారు.ఈ వెబ్‌సైట్‌ ప్రకారం దీని ధర అక్షరాలా 100 డాలర్లు.దీనినే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దాదాపు రూ.8,400.అంటే ఎంత ఎక్కువ అర్థం చేసుకోవచ్చు.

దీనిని కొనుగోలు చేసేందుకు క్రిప్టోకరెన్సీ డోజీకాయిన్స్‌ కూడా ఉపయోగించవచ్చని మస్క్‌ వెల్లడించారు.

వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..
Advertisement

తాజా వార్తలు