ఈ రోజు ఎలిమినేటర్ లో ఢిల్లీ తో సన్ రైజర్స్ మ్యాచ్...ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి.

చెన్నై తో జరిగిన మ్యాచ్ లో ముంబై పెద్దగా కష్టపడకుండానే గెలిచే ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంది.ఇకపోతే ఈ రోజు ఎలిమినేటర్ లో ఢిల్లీ తో సన్ రైజర్స్ ఆడనుంది.ఈ మ్యాచ్ లో గెలిచే జట్టు చెన్నై జట్టు తో 2 వ క్వాలిఫైయర్ లో ఆడనుంది.9 విజయాలతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ కి చేరితే , సన్ రైజర్స్ కేవలం 6 విజయాలతో ప్లే ఆఫ్స్ లోకి చేరింది.సన్ రైజర్స్ అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో పెద్దగా ఆకట్టుకోవడం లేదు.ఈ మ్యాచ్ లో ఎలాగైనా ఢిల్లీ పైన గెలవాలన్న లక్ష్యం తో బరిలోకి దిగనున్నారు.

 Eliminator Match Delhi Capital Versus Sunrisers Hyderabad Who Will Win-TeluguStop.com

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 14 మ్యాచ్ లు జరగగా ఢిల్లీ జట్టు 5 మ్యాచ్ లలో విజయం సాధించగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 9 మ్యాచ్ లలో విజయం సాధించింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఢిల్లీ కి సన్ రైజర్స్ కి జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ విశాఖపట్నం లో జరగనుంది.ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా జరగలేదు.ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.బ్యాట్స్ మెన్ కాస్త నిలదొక్కుకుంటే పరుగుల వరద ఖాయం.

ఈ రోజు ఎలిమినేటర్ లో ఢిల్లీ తో

3)ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ఈ సీజన్ లో ఢిల్లీ జట్టు తమ ఫ్రాంచైజ్ పేరు మార్చుకొని బరిలోకి దిగింది దానికి తగ్గట్టే అద్భుతంగా రాణించి ప్లే ఆఫ్స్ కి చేరింది.నెట్ రన్ రేట్ మెరుగ్గా లేకపోవడం తో 3 వ స్థానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.సన్ రైజర్స్ తో ఆడే మ్యాచ్ లో గెలిచి క్వాలిఫైయర్ కి అర్హత సాధించాలని ఢిల్లీ జట్టు ఆశిస్తోంది.

ఇక ఆ జట్టు స్టార్ బౌలర్ రబడ గాయం కారణం గా రెండు మ్యాచ్ ల క్రితమే స్వదేశానికి వెళ్లగా , మోరిస్ కూడా వరల్డ్ కప్ కోసం స్వదేశానికి వెళ్ళాడు.దానితో బౌలింగ్ లో ఢిల్లీ కాస్త బలహీనంగా కనిపిస్తుంది.

ఇకపోతే బ్యాటింగ్ లో పటిష్టంగా నే కనిపిస్తున్న ఢిల్లీ జట్టు కి ఫామ్ లో లేని ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో రాణిస్తే ఆ జట్టు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ( PROBABLE XI )
ప్రిథ్వీ షా , శిఖర్ ధావన్ , శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ ,కోలిన్ ఇంగ్రామ్ , రూథర్ఫోర్డ్ , కీమో పాల్ , అక్షర్ పటేల్ , అమిత్ మిశ్రా , ఇషాంత్ శర్మ , ట్రెంట్ బోల్ట్

ఈ రోజు ఎలిమినేటర్ లో ఢిల్లీ తో

4)సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా ఉండబోతుంది

సన్ రైజర్స్ జట్టు లీగ్ స్టేజి లో అనుకున్నంతగా రాణించలేకపోయింది.లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్ లలో ఓడిపోయినప్పటికి మెరుగైన రన్ రేట్ తో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయింది.ఇక ఆ జట్టు మిడిల్ ఆర్డర్ కాస్త బలహీనంగా ఉంది.

విజయ్ శంకర్ , యూసుఫ్ పఠాన్ లు బ్యాటింగ్ లో రాణించి చాలా మ్యాచ్ లు అవుతుంది.ఇక ఈ మ్యాచ్ లో ఓపెనర్లు అయిన సహా లేదా గుప్తిల్ లో ఎవరో ఒకరు రాణిస్తే ఆ జట్టు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.

అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్ లో ఉన్న మనీష్ పాండే ఈ మ్యాచ్ లో ఎలా ఆడుతాడో చూడాల్సి ఉంది.బౌలింగ్ లో నబి , భువనేశ్వర్ , రషీద్ లతో పటిష్టంగా ఉంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( PROBABLE XI )
వృద్ధిమాన్ సహా , మార్టిన్ గుప్తిల్ , మనీష్ పాండే , కేన్ విలియమ్సన్ , విజయ్ శంకర్ , మహమ్మద్ నబి , యూసఫ్ పఠాన్ , రషీద్ ఖాన్ , భువనేశ్వర్ కుమార్ , ఖలీల్ అహ్మద్ , బాసిల్ తంపి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube