కాజల్ ఫేక్.. ఆమె వల్లే హౌస్ లో గొడవలు అంటూ తేల్చేసిన ప్రియాంక?

Eliminated Contestant Priyanka Singh Shocking Comments On Rj Kajal And Manas

ఇటీవలే బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక సింగ్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేల్చేసింది ప్రియాంక.

 Eliminated Contestant Priyanka Singh Shocking Comments On Rj Kajal And Manas-TeluguStop.com

ప్రియాంక బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పింది అంటే అతను ఖచ్చితంగా మానస్ అయి ఉంటాడని బిగ్ బాస్ ప్రేక్షకులకు అర్థమయ్యే ఉంటుంది.ప్రియాంక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు మానస్ ఆర్య సినిమాలో సాంగ్ డెడికేట్ చేశాడు.

దీంతో ప్రియాంక మానస్ పై పెంచుకున్న ప్రేమ మరింత రెట్టింపు అయ్యింది.

 Eliminated Contestant Priyanka Singh Shocking Comments On Rj Kajal And Manas-కాజల్ ఫేక్.. ఆమె వల్లే హౌస్ లో గొడవలు అంటూ తేల్చేసిన ప్రియాంక-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత పింకీ మానస్ గురించి పలు ఆసక్తికర వాఖ్యలు చేసింది.

మానస్,సన్నీ నా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఇద్దరిలో ఎవరు బిగ్ బాస్ విన్నర్ అయినా పర్వాలేదు అని తెలిపింది.అలాగే ఒక ఫ్రెండ్ గా మానస్ గెలవాలని కోరుకుంటున్నా, మానస్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే దయచేసి బావ అని అనొద్దు అని పింకీ తెలిపింది.

చాలామంది మా ఇద్దరి మధ్య లవ్ ఉంది అంటున్నారు.మా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది అని పింకీ తెలిపింది.

అలాగే మానస్ కనుక విన్నర్ అయితే నాకంటే ఎక్కువగా సంతోషించేవారు లేరని ప్రియాంక చెప్పుకొచ్చింది.

Telugu Kajal, Priyanka Singh, Rj Kajal, Vj Sunny-Movie

ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో కాజల్ ఫేక్ అని నాకు అనిపిస్తోంది.ఏ విషయాన్ని అయినా కూడా ముడిపెట్టి లాగుతూ ఉంటుంది.ఆ విషయం వారు మర్చిపోయిన కూడా దానిని పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది.

ఎవరో ఒకరి మధ్య గొడవలు పెడుతూనే ఉంటుంది అనేది నా అభిప్రాయం అంటూ కాజల్ గురించి పింకీ సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇక టాప్ 2లో సన్నీ, మానస్ ఉంటారనే అనుకుంటున్నా, సన్నీ అన్నయ్యతో నాకు మంచి బాండింగ్ ఉంది అని చెప్పుకొచ్చింది ప్రియాంక.

#Kajal #Priyanka Singh #Rj Kajal #Priyanka Singh #VJ Sunny

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube