సన్నీ ఓటమిని అస్సలు అంగీకరించడు.. నా ధైర్యం అదే: జెస్సీ కామెంట్స్ వైరల్?

Eliminated Contestant Bigg Boss Jessie Great Words About Vj Sunny

తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో  రసవత్తరంగా సాగుతోంది.బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంటుండడంతో కంటెస్టెంట్ ల మధ్య పోటీ పెరిగింది.

 Eliminated Contestant Bigg Boss Jessie Great Words About Vj Sunny-TeluguStop.com

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సన్నీ, షణ్ముఖ్ ల మధ్య హోరా హోరీ ఫైట్ నడుస్తోంది.ఈ మధ్యకాలంలో షణ్ముఖ్,సిరితో హాగ్,కిస్ లతో ఓటింగ్ లో వెనక పడగా.

సన్నీ టాప్ లో దూసుకుపోతున్నాడు.తాజాగా సన్నీ గురించి ఎలిమినేట్ కంటెస్టెంట్ జెస్సీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Eliminated Contestant Bigg Boss Jessie Great Words About Vj Sunny-సన్నీ ఓటమిని అస్సలు అంగీకరించడు.. నా ధైర్యం అదే: జెస్సీ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవలే బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సి అనారోగ్యం కారణంగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జెస్సీ పార్టీలలో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు.

హౌస్ లో ఉన్నప్పుడు సన్నీతో సై అంటే సై అని గొడవ పడ్డ జెస్సి బయటకు వచ్చిన తర్వాత సన్నీ పై ప్రశంసల వర్షం కురిపించాడు.షణ్ముఖ్, సన్నీల మధ్య టాప్ ఫైవ్ ఉంటేనే ఆటలు అసలైన మజా అంటూ వారిద్దరితో తనకు ఉన్న బంధాన్ని షేర్ చేసుకున్నాడు జెస్సి.

Telugu Eliminate, Jessie, Sunny-Movie

సన్నీ వెరీ గుడ్ గేమర్.అతనిలో వరస్ట్ ఏంటంటే కోపంలో వర్డ్స్ లూజ్ అవుతాడు.ఆ ఒక్క విషయంలో సన్నీ కరెక్ట్ చేసుకుంటే టాప్‌లోనే ఉంటాడు.నిజానికి సన్నీతో నాకు మంచి రిలేషన్ ఉండేది.గొడవలు ఇవన్నీ కామన్ కానీ.సన్నీ లేకపోతే నాకు బోరింగ్ అనిపించేది.

సన్నీ ఉంటే గేమ్ ఆడాలనిపించేది.సన్నీ బలంగా ఆడతాడు కాబట్టి మాలో కసిపెరిగేది.

సన్నీ నా టీమ్ లో ఉంటే రిలాక్స్ అయిపోయేవాడిని.రాజుల టాస్క్‌లో సన్నీ నా టీంలో ఉన్నాడనే బలంతోనే ఆడాను.

గెలిచాను.గేమ్‌లో ఎవరైనా తప్పు చేస్తే సన్నీ చూసుకుంటాడులే అనే ధైర్యంతో ఆడొచ్చు.

సన్నీ తప్పు చేస్తే ఒప్పుకోడు.మిగిలిన వాళ్లు తప్పు చేస్తే లైట్ తీసుకుంటారేమో కానీ.

సన్నీ అస్సలు ఒప్పుకోడు.ఓటమిని అస్సలు అంగీకరించడు.

చాలా గుడ్ క్వాలిటీ.అంటూ సన్నీ పై ప్రశంసల వర్షం కురిపించాడు జెస్సి.

#Sunny #Jessie #Eliminate

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube