'మా'లో మళ్లీ రాజుకుంటున్న వివాదం, ఈసారి రాజశేఖర్‌ వర్సెస్‌ నరేష్‌  

Eligations In Maa Association Between Rajasekar Vs Naresh-eligations In Maa Association,hero Krishna,hero Naresh,hero Rajasekar,tollywood Box Office

గతంలో ఎప్పుడు లేని విధంగా మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ వార్తల్లో వస్తూ ఉంది.కొన్నాళ్ల క్రితం అధ్యక్షుడు శివాజీ రాజా మరియు నరేష్‌ల మద్య వైరం ఏ స్థాయికి పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Eligations In MAA Association Between Rajasekar Vs Naresh-Eligations Maa Hero Krishna Naresh Tollywood Box Office

వారిద్దరు కూడా ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శల స్థాయిలో విమర్శలు చేసుకున్నారు.ఇక ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేయడంతో పాటు డబ్బులు కూడా ఖర్చు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

  మా ఎన్నికల్లో నరేష్‌ ప్యానల్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్‌ గెలుపొందాడు.ఇక నరేష్‌ విషయం మొదటి నుండి కూడా రాజశేఖర్‌కు నచ్చడం లేదు.రాజశేఖర్‌ తనకు మద్దతుగా ఉండే కొందరు సభ్యులతో ఈ విషయంపై మొదటి నుండి చర్చిస్తున్నాడు.

Eligations In MAA Association Between Rajasekar Vs Naresh-Eligations Maa Hero Krishna Naresh Tollywood Box Office

మా కోసం ఫండ్స్‌ రైజింగ్‌ కార్యక్రమాలు చేపట్టాలని రాజశేఖర్‌ అనుకుంటున్నాడు.కాని అందుకు నరేష్‌ నుండి ఎలాంటి సహకారం అందడం లేదు.

ఆయన బిజీగా ఆయన పనులు చూసుకుంటున్నాడు.

  మా అధ్యక్షుడు అయ్యి ఉండి మీటింగ్స్‌కు రాకపోవడంతో పాటు మా ను పట్టించుకోవడం లేదు అంటూ తీవ్ర స్థాయిలో అసహనంతో రాజశేఖర్‌ ఉన్నాడు.ఈ విషయమై తాజాగా ఒక రహస్య భేటీ కూడా జరిగింది.ఆ భేటీలో నరేష్‌కు షోకాజు నోటీసు ఇవ్వాలనే నిర్ణయం కూడా జరిగింది.

జీవిత మద్యవర్తిత్వంతో ఈ విషయాన్ని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు.నరేష్‌ మా కార్యక్రమాలు పట్టించుకోవడం లేదు అంటూ రాజశేఖర్‌ ఆరోపిస్తున్నాడు.

మరి ఈ విషయమై నరేష్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

తాజా వార్తలు

Eligations In Maa Association Between Rajasekar Vs Naresh-eligations In Maa Association,hero Krishna,hero Naresh,hero Rajasekar,tollywood Box Office Related....