టీటీడీ ఎనుగులతో వాకింగ్‌ చేయించారు

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలు అవుతుంది.ఈ సమయంలో దేశంలోనే అత్యంత ప్రసిద్ది గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఎనుగులకు పని లేకుండా పోయింది.

 Elephents Walking In Ttd, Corona Virus, Ttd, Elephents, Tirumala Streets, Elephe-TeluguStop.com

ప్రతి రోజు ఉదయం సాయంత్రం సమయంలో స్వామి వారి సేవలో ఏనుగులు పాల్గొంటూ ఉంటాయి.ప్రతి రోజు అవి నడుస్తూ స్వామి సేవలో పాల్గొనడం అలవాటు అయాయ్యి.

అయితే గడచిన రెండు వారాలుగా వాటికి ఏ పని లేకపోవడంతో మావటీలు వాటిని కనీసం వాకింగ్‌కు అయినా తీసుకు వెళ్లడం మంచిదనే నిర్ణయానికి వచ్చినారట.

ఏనుగులు కదకుండా ఒక్క చోట కూర్చుని ఉంటే వాటి కాళ్లకు పుళ్లు పడతాయని అందుకే వాటికి వాకింగ్‌ చేయించాలని అధికారులు చెప్పడంతో మావటీలు ఆ పని చేస్తున్నారు.

తాజాగా తిరుమల మాడవీధుల్లో ఏనుగులను రెండు కిలో మీటర్ల మేరకు నడిపించారు.ఇకపై కూడా ఒకటి లేదా రెండు రోజులకు ఒకసారి ఏనుగులను వాకింగ్‌ చేయిస్తామంటూ మావటీలు చెబుతున్నారు.

తిరుమల దేవాలయంలో భక్తులు లేకపోవడంతో వెలవెల పోయింది. గడచిన 50 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి కనిపించలేదంటూ ఒక మాటవి వాడు మీడియాతో చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube