పొడుపు కథల్లాంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్ చల్ చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.ఇక అవి చూసినప్పుడల్లా మన మెదడుకి బాగా పని పెరిగి పోతూ ఉంటుంది, ఎందుకంటే ఆ ఫోటోలను చూస్తే.
కంటికి కనిపించేది నిజమేనా అని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం.తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
అందరూ ఈ వీడియో చూస్తూ తెగ ఆలోచనలో పడిపోతున్నారు.
ఈ వీడియోలో అంతలా మెదడుకు పని చెప్పే పని ఏముంది అని అంటారా… అంతలా ఏం లేదండి మామూలుగా ఓ ఏనుగుల గుంపు కలిసి ఓ నది వద్ద నీళ్లు తాగుతున్న వీడియో.
మరి ఇందులో పెద్దగా మెదడుకు పని ఏంటి అనే కదా మీ డౌట్… ఈ వీడియోలో ఉన్న ఫోటో చూసి ఇందులో ఏనుగులు ఎన్ని ఉన్నాయో గుర్తుపట్టాలి.చూడగానే నాలుగు ఏనుగులు ఉన్నాయి కదా అని అంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే.
మరి ఎన్ని ఏనుగులు ఉన్నాయి అని అంటారా… ఈ వీడియోలో ఎన్ని ఏనుగులు ఉన్నాయో అని తెలుసుకోవాలంటే మాత్రం వీడియో ని పూర్తిగా చూడాల్సిందే మరి.70 సెకండ్ల నిడివిగల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.ఈ వీడియోలో మన కంటికి కనిపించినట్లుగా నాలుగు ఏనుగులు మాత్రమే లేవు పూర్తిగా 7 ఏనుగులు ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి.ఈ వీడియో లో ఎన్ని ఏనుగులు ఉన్నాయో మీకు క్లారిటీ వస్తుంది.