తోటి ఏనుగు మృతి చెందితే మిగిలినవి ఏం చేస్తాయంటే..

తోటి ఏనుగులు మరణించినప్పుడు మిగిలిన ఏనుగులు మనుషుల మాదిరిగానే దుఃఖిస్తాయట.ఈ విషయాలు తొలిసారిగా స్పష్టం అయ్యాయి.

 Elephants Mourning Spotted On Death Of Another Elephant , Elephants , Elephants Mourning , Death , Mourning , Dr Sanjita Pokharel , Elephant Carcass , Royal Society Open Science Journal‌-TeluguStop.com

తోటి ఏనుగు మరణించినప్పుడు మిగిలిన ఏనుగులు గుంపుగా చేరి సంతాపం వ్యక్తం చేశాయి.దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా కదిలించివేస్తోంది.

ఈ ఆడ ఏనుగు భారతదేశంలోని వన్యప్రాణుల అభయారణ్యంలో ఇన్ఫెక్షన్ కారణంగా మరణించింది.చిన్న ఏనుగులు, మందలోని ఇతర ఏనుగులు దాని కళేబరం చుట్టూ వృత్తాకారంలో తిరిగాయి.

 Elephants Mourning Spotted On Death Of Another Elephant , Elephants , Elephants Mourning , Death , Mourning , Dr Sanjita Pokharel , Elephant Carcass , Royal Society Open Science Journal‌-తోటి ఏనుగు మృతి చెందితే మిగిలినవి ఏం చేస్తాయంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ దృశ్యాన్ని చూసినప్పుడు కళ్లు చమర్చాయని స్మిత్‌సోనియన్ కన్జర్వేషన్ బయాలజీ ఇనిస్టిట్యూట్‌లోని జీవశాస్త్రవేత్త డాక్టర్ సంజితా పోఖారెల్ తెలిపారు.తాము తగిన దూరం నుండి ఈ సంఘటనను వీడియో తీశామన్నారు.

సంజితతో పాటు జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీలో వన్యప్రాణి జీవశాస్త్రవేత్త నచికేత శర్మ కూడా దీనిలో భాగస్వామ్యం వహించారు.ఇద్దరూ దీని గురించి మరింత అధ్యయనం చేయాలనుకున్నారు.

ఎందుకంటే అలాంటి దృశ్యాన్ని చూడటం చాలా బాధకలిగించిందంటున్నారు.

ఏనుగులు దట్టమైన అడవులలో నివసిస్తాయి.

పచ్చిక బయళ్లలో కూడా ఉంటాయి.ఈ శాస్త్రవేత్తల అధ్యయన నివేదిక రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.

ఏనుగులు తమ బాధను వ్యక్తం చేసే వీడియోలను యూట్యూబ్ ద్వారా పంపాలని జీవశాస్త్రవేత్తలు ఇద్దరూ ప్రపంచవ్యాప్తంగా అందరికీ విజ్ఞప్తి చేశారు.ఈ నేపధ్యంలో చాలా వీడియోలు వెలుగుచూశాయి.

వాటిలో ఏనుగులకు సంబంధించిన విభిన్న ప్రతిచర్యలు కనిపించాయి.ఏనుగులు తోటి ఏనుగు కళేబరాన్ని ముట్టుకోవడం, దాని చుట్టూ తిరగడానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

కొన్ని వీడియోలలో ఏనుగులు తోటి ఏనుగులకు సెక్యూరిటీ ఇస్తున్నట్లు కనిపించారు.ఏనుగు పిల్ల చనిపోతే, దాని తల్లి ఏనుగు దానిని తన తొండంతో తీసుకువెళ్లడం కూడా వీడియోలో కనిపించింది.

ఈ రకమైన అధ్యయనాన్ని కంపారిటివ్ థానాటాలజీ అంటారు.ఇందులో వివిధ జీవరాశులు చనిపోతే వాటి పట్ల తోటి జీవుల స్పందన ఎలా ఉంటుందనేదానిని అధ్యయనం చేస్తారు.

ఆసియా ఏనుగుల గురించి చాలా కథలు ఉన్నాయని డాక్టర్ పోఖరెల్ తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube