గజరాజులతో రెండు జిల్లాలు అతలాకుతలం  

శ్రీకాకుళం చిత్తూరు జిల్లాల్లో అడవి ఏనుగులు బీభత్సం నిత్యం సృష్టిస్తూనే ఉన్నాయి .వాటిపై ఒకప్పుడు కాంగ్రెస్ సర్కార్లో ముగ్గురు ముఖ్యమంత్రులు చేతులు ఎత్తేసారు . ఇప్పుడు చంద్రబాబు సర్కార్ అటవీ శాఖ పై కన్నెర్ర చేయడం తప్పితే ఎలాంటి చర్యల్లో లేనేలేరు పలమనేరు,గంటా గ్రామాల్లో నే కాకుండా కొండలపై ఉండే గిరిజన తండాలపై దాడులు చేస్తూనే ఉన్నాయి వరి, బీన్స్, టమాటా పంటలతో బాటు తోటలను కూడా వదిలిపెట్టాడం లేదు. ఇలా ఈ నెలలో ఇది నాలుగోసారి చిత్తూరు ఐదోసారి శ్రీకాకుళం లో బీభత్సం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు స్పందించి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని వారు ఇప్పటికే కొన్ని వందల సార్లు కోరుతూనే ఉన్నారు . అడవుల్లో ఆహారం, నీరు దొరకకపోవడంతోనే అవి జనంలోకి వస్తున్నాయని అటవీ అధికారులు నిత్యం చెప్పే పాత కాలం పాట పాడుతూనే ఉన్నారు