ఏనుగు బీభత్సం.. దీంతో ఎందుకు పెట్టుకున్నానా అని ఫీల్ అయిన చిరుత!

మాములుగా అడవి జంతువులను చుస్తే ఎవరైనా సరే గజగజ వణికి పోతారు.ఇక చిరుత పులి, సింహం లాంటి వాటి పేరు విన్న కూడా వణుకు వస్తుంది.

 Elephant Harassment  Leopard Who Feels Why He Was Put Up With This! , Elephant,-TeluguStop.com

అవి అంటే అంతగా బయపడతాము.చిరుత పులిని చుస్తే ఏ జంతువు అయినా వణికి పోవాల్సిందే.

దాని దృష్టిలో పడ్డ ఏ జంతువు పరిస్థితి అయినా ఇలానే ఉంటుంది.చిరుత కంటిలో పడిన ఏ జంతువైనా తప్పించు కోవడం అసాధ్యమే.

ఏదో వాటి అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు అవి తప్పించుకో గలుగు తాయి కానీ ఎక్కువగా అయితే ఆ జంతువును తప్పించు కోకుండా అవి వేటాడుతాయి.అటువంటి చిరుత ఒక ఏనుగును చూసి భయంతో గజగజ వణికి పోయింది.

వేట కోసం బయలు దేరిన ఒక చిరుత ఏనుగుల మీద దాడికి వెళ్ళింది.ఇలా చిరుత ఏనుగుల గుంపు మీదకు దాడికి వెళ్లగా ఒక ఏనుగు చిరుత పులి మీదకు  ఎదురు తిరిగింది.

ఆ తిరగ బడిన ఏనుగు చిరుత పులిని పరుగులు పెట్టించి మరి తరిమి తరిమి కొట్టింది.దాంతో పరుగు లంకించుకుంది చిరుత.

అలా ఏనుగును చూసి చిరుత పరుగు పెట్టడం ఏనుగు ఎంతకీ తనను ఆపకుండా పరుగు పెట్టించడంతో చిరుత ఏనుగును చూసి చెట్టు పైకి ఎక్కి దాక్కుంది.అయినా కూడా ఏనుగు తగ్గకుండా చిరుతను చెట్టు ఎక్కినా కూడా వదల కుండా దానిని ఎలా అయినా చెట్టు మీద నుండి దింపాలని అనుకుంది.

ఏనుగు తన బలాన్ని అంత ఉపయోగించి చెట్టును గట్టిగా  ఊపింది.అక్కడితో ఆగకుండా తన తొండంతో మట్టిని తీసి చిరుత మీదకు విసిరింది.

ఆ సమయంలో ఆ చిరుత ఈ ఏనుగులతో ఎందుకు పెట్టుకున్నాను అని అనుకుని ఉంటుంది.అంతలా ఆ ఏనుగు చిరుతని భయపెట్టింది.

దక్షిణ ఆఫ్రికా లోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్ లో ఉన్న రిజర్వ్ పార్కులో ఈ ఘటన జరిగింది.ఈ సన్నివేశాన్ని ఒక ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసాడు.

ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube