షోరూం వింత ఆఫర్: కరోనా వస్తే క్యాష్ బ్యాక్ అంట!

కరోనా మహమ్మారి తో వింత వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఈ మహమ్మారి పేరును వాడుకొని కొందరు వ్యాపారాలు చేస్తుంటే కొందరేమో వింత ఆఫర్ లు ఇస్తున్నారు.

 Electronic Showroom Cash Back Offer For The Covid Pandemic Situation In Kerala,-TeluguStop.com

ఇంతకీ ఆ వింత ఆఫర్ లు ఏంటి అని అనుకుంటున్నారా.కస్టమర్ లను ఆకర్షించాలన్న ఉద్దేశం తో ఒక ఎలక్ట్రానిక్ షాప్ వారు వింతైన ఆఫర్ ప్రకటించారు.మా షాపు లో షాపింగ్ చేసి ఎవరికైనా కరోనా వస్తే వారికి రూ.50 వేలు క్యాష్ బ్యాక్ ఇస్తాం అంటూ వింత ప్రకటన చేశారు.ఒకప్పుడు షాపింగ్‌ మాల్స్,సూపర్ మార్కెట్లు అన్ని కూడా జనం తో నిండిపోయి ఉండేవి.అయితే ఈ మహమ్మారి కారణంగా అందరూ కూడా ఇప్పుడు అత్యవసరమైతేనే ఇల్లు కదులుతున్నారు.

నిత్యావసరాలను మాత్రమే కొనుగోలు చేస్తూ, అనవసర ఖర్చు జోలికి వెళ్లడం లేదు.కర్మ బాగోలేక ఏమైనా కరోనా వస్తే చేతిలో డబ్బులు లేకపోతే పరిస్థితులు అదుపులో ఉండవు అన్న కారణంగానే అందరూ కూడా ఆన్ లైన్ ల ద్వారానే ఆర్డర్ లు చేసుకుంటున్నారు.

దీంతో ఒకప్పుడు కిటకిటలాడిన షాపింగ్ కాంప్లెక్స్‌లు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి.అయితే ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్ల ను ఆకర్షించాలి అని ఒక ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించే షోరూం ప్రకటించిన ఒక వింతైన ఆఫర్ ఇప్పుడు వివాదాస్పదమైంది.
మా దగ్గర షాపింగుకొచ్చిన కస్టమర్లు 24 గంటల్లో కరోనా బారిన పడితే రూ.50 వేలు క్యాష్ బ్యాక్ ఇస్తామని ప్రకటించింది.ఆగష్టు 15 నుంచి ఆగష్టు 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని అటు పేపర్లు, టీవీలు, డిజిటల్ మాధ్యమాల్లో కూడా ప్రకటనలు గుప్పించింది.అయితే విషయం తెలుసుకున్న కొట్టాయం జిల్లా పాల మున్సిపాలిటీ కౌన్సిలర్, లాయర్ అయిన బిను పులిక్కక్కందం ఈ ప్రకటన చట్ట వ్యతిరేకం, శిక్షార్హమంటూ సీఎం కు పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.

వారిచ్చే క్యాష్ బ్యాక్ కోసం అప్పటికే కరోనా సోకిన వ్యక్తి ఎవరైనా ఆశపడి.తన ఆరోగ్య పరిస్థితిని దాచిపెట్టి ఈ షోరూంకు వచ్చే ప్రమాదం ఉందని,దానివల్ల ఇది మరో పదిమందికి అంటుకుంటుంది అని వారు అభిప్రాయపడ్డారు.

Telugu Cash, Corona Effect, Covid Pandemic, Kerala-

అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నవారెవరైనా డబ్బు కోసం ఆశపడి కరోనాను కొని తెచ్చుకునే ప్రమాదం కూడా లేకపోలేదని, ఉద్దేశపూర్వకంగా కరోనా వ్యాప్తికి ఇది దోహదం చేస్తుందంటూ వారు ఆ పిటీషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.మొత్తానికి కస్టమర్ల ను ఆకర్షించాలి అని ఆ షాపు యజమాని చేసిన ప్లాన్ కాస్తా ఇలా బెడిసికొట్టినట్లు అయ్యింది.మరి దీనిపై సీఎం గారు ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube