ఆరోగ్యాన్నందించే ఎలక్ట్రిక్ చాప్‌స్టిక్‌లు.. ఎలా ప‌నిచేస్తాయంటే..

బర్గర్‌లు, నూడుల్స్‌తో పాటు ఇలాంటి చాలా ఆహార ప‌దార్థాల కార‌ణంగా మ‌న శరీరంలో ఉప్పు పరిమాణం పెరుగుతోంది.శరీరంలో ఉప్పు పెరగడం వల్ల గుండె, కిడ్నీ వంటి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

 Electronic Chopsticks To Reduce Your Salt Intake Details, Electronic Chopsticks,-TeluguStop.com

వాటిని అరికట్టేందుకు జపాన్ శాస్త్రవేత్తలు ఎలక్ట్రిక్ చాప్ స్టిక్స్ తయారు చేశారు.అవి పనిచేసే విధానం కార‌ణంగా మ‌న‌ శరీరంలో ఉప్పు పరిమాణం అదుపులో ఉంటుంది.

ఇప్పుడు ఆ చాప్ స్టిక్స్ ఎలా ప‌నిచేస్తాయో తెలుసుకుందాం.దీన్ని తయారుచేసిన జపాన్‌లోని మీజీ యూనివర్సిటీ పరిశోధకులు… ఈ ఎలక్ట్రిక్ చాప్‌స్టిక్‌లతో ఆహారం తింటే, నోటిలో సోడియం అయాన్‌లు విడుదలవుతాయని, ఉప్పు రుచిని అనుభవిస్తారని చెప్పారు.

చాప్‌స్టిక్‌లు చేతిలో ధరించే పరికరానికి జోడిస్తారు.ఇది మీకు ఉప్పగా అనిపించేలా పని చేస్తుంది.కాబట్టి ఇది అదనపు ఉప్పు శరీరంలోకి చేరకుండా నిరోధించవచ్చు.ఈ చాప్‌స్టిక్‌లు ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ ద్వారా ఆహార రుచిని పెంచుతాయని రాయిటర్స్ నివేదికలో పరిశోధకురాలు హోమీ మియాషితా తెలిపారు.

ఇది మినీ కంప్యూటర్ నుండి నియంత్రిత‌మ‌వుతుంది.ఈ పరికరంలో చాలా బలహీనమైన కరెంట్‌ని ఉప‌యోగిస్తుంది.

దాని నుండి ఎటువంటి ప్రమాదం లేదు.ఎలక్ట్రిక్ చాప్‌స్టిక్‌లను ఉపయోగించడం ద్వారా ఆహార రుచి 1.5 రెట్లు పెరుగుతుంది.ఈ చాప్‌స్టిక్‌లు ఆహారం నుండి ఉప్పును తగ్గించడానికి ప్రయత్నిస్తాయి.

ఎందుకంటే చాలా దేశాల ఆహారంలో ఉప్పు పరిమాణం ఎక్కువగా ఉంటుంది.

Telugu Diseases, Electric, Electronic, Japan, Salt Intake, Sodium-General-Telugu

ముఖ్యంగా ఆసియా ఆహారంలో ఇది క‌నిపిస్తుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివ‌రాల ప్రకారం రోజువారీ ఆహారంలో ఉప్పు క్వాంటిటీ 5 గ్రాములు మించకూడదు.జపాన్‌లో సగటు ప్రజలు రోజుకు 10 గ్రాముల ఉప్పును తింటారు.

అధిక ఉప్పు శరీరంలోకి చేరడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.గుండె, మూత్రపిండాలు, అధిక రక్తపోటు సమస్య, ఎముకల వ్యాధి, ఉద‌ర‌ క్యాన్సర్ మొదలైనవి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఈ వ్యాధుల ముప్పును తగ్గించుకోవాలంటే ఆహారంలో ఉప్పును తగ్గించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు.అటువంటి పరిస్థితిలో ఎలక్ట్రిక్ చాప్ స్టిక్‌లు సహాయపడతాయి.

వచ్చే ఏడాది నాటికి దీనిని మార్కెట్లోకి విడుదల చేసే అవ‌కాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube