రైతు ప్రాణం తీసిన విద్యుత్.. వీరి మరణాలు ఆగేది ఎప్పుడో.. ?

ఈ ప్రపంచాన్నిరైతు అనేవారు లేకుండా ఊహించండి.అసలు రైతులు లేకపోతే ప్రపంచమే లేదన్నది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన అక్షర సత్యం.

 Electricity That Took The Life Of A Farmer-TeluguStop.com

అలాంటి రైతుని అడ్దం పెట్టుకుని నీచ రాజకీయాలు చేసే దౌర్భాగ్యులు తగలడ్ద దేశం మనది.

దేశానికిరైతే వెన్నుముక అన్న మాటలు పెదవుల వరకే గానీ ఆత్మ సాక్షిగా మరచిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది.

 Electricity That Took The Life Of A Farmer-రైతు ప్రాణం తీసిన విద్యుత్.. వీరి మరణాలు ఆగేది ఎప్పుడో.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలాంటి రైతు గురించి చెప్పమంటే గంటలు గంటలు ఊకదంపుడు మాటలు చెబుతారు.కానీ వారి సంక్షేమం కోసం ఆలోచన చేయరు.ఇప్పటికే పంటలు సరిగ్గా పండక, పెరిగిన ధరలతో ప్రతి క్షణం యుద్ధం చేస్తున్న రైతు, ఎన్నో సందర్భాల్లో పరిస్దితులతో పోరాడే ధైర్యం చాలక బలవణ్మరణానికి పాల్పడుతున్నాడు.అదీ చాలక పొలం పనుల్లో ఎదురయ్యే ఊహించని ప్రమాదాలతో మరణిస్తున్నాడు.

మరి వీరి ప్రాణాలకు రక్షణ ఏదంటే? సమాధానం దొరకదు.వీరి మరణాలు ఆగేది ఎప్పుడనే ప్రశ్నకు జవాబు చిక్కదు.

ఇకపోతే జగిత్యాల జిల్లామల్లాపూర్ మండలం నడికుడ గ్రామానికి చెందిన భూక్య రాజునాయక్(52) అనే రైతు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.పొలంలో మందు చల్లేందుకు వెళుతుండగా నేలపై పడి ఉన్న కరెంట్ తీగను చూడలేక పోయాడట.

దీంతో ఆ తీగ కాలికి తగలడంతో రైతు అక్కడికక్కడే మృతిచెందాడని సమాచారం.

#Farmer Death #Electric Shock #Mallapur #Jagittala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు