తెలంగాణ చరిత్రలోనే రికార్డుస్థాయిలో విద్యుత్ వినియోగం

తెలంగాణలో రోజు రోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది.ఈ క్రమంలోనే రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది.

నిన్న 14,501 మెగావాట్ల విద్యుత్ వినియోగం కాగా.ఇవాళ మధ్యాహ్నానికి 14,794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని విద్యుత్ శాఖ వెల్లడించింది.

గత ఏడాది ఇదే రోజు తెలంగాణలో 12,996 మెగావాట్ల విద్యుత్ ను వినియోగించారు.అయితే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణంతో పాటు పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ కు భారీ డిమాండ్ ఏర్పడింది.

రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానికే అవుతుంది.అంతేకాదు దేశంలోనే వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్ ను వినియోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ పేరు పొందింది.

Advertisement

డిమాండ్ ఎంత ఉన్నా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ తెలిపారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

తాజా వార్తలు