లైట్లు కాకుండా ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఆపాల్సిన పని లేదు

ఏప్రిల్‌ 5వ తారీకున అంటే రేపు రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాల పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు ఇంటోలని ప్రతి లైట్‌ను బంద్‌ చేసి బయటకు వచ్చి గేట్‌ వద్ద నిల్చుని దీపం, కోవత్తి లేదంటే మొబైల్‌ టార్చ్‌ అయినా వెలిగించాలంటూ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.రేపు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంను నిర్వహించాలంటూ ప్రముఖులు కూడా మీడియా ద్వారా పిలుపునిస్తున్నారు.

 Electrical Department Give The Clarity About Modi Message About Power Off, Modi,-TeluguStop.com

అయితే ఈ సమయంలో కొందరు రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారు.

ముఖ్యంగా ఒకేసారి అన్ని లైట్లు ఆర్పేయడం వల్ల విద్యుత్‌ గ్రిడ్‌పై ప్రభావం పడుతుందని తద్వారా గ్రిడ్‌ కుప్పకూలే ప్రమాదం ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు.

ఆ విషయం నిజం కాదని అధికారులు అంటున్నారు.ఇక ఇంట్లోని మెయిన్‌ స్విఛ్‌ను రాత్రి 9 గంటల సమయంలో ఆఫ్‌ చేయాలని కొందరు పిలుపునిస్తున్నారు.అయితే విధ్యుత్‌ అధికారులు మాత్రం ప్రధాని కేవలం లైట్లను మాత్రమే ఆఫ్‌ చేయాలని చెప్పారు.ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఆఫ్‌ చేయల్సిన పని లేదు అంటూ చెప్పుకొచ్చారు.

కేవలం లైట్లు బంద్‌ చేసి బయట దీపాలను వెళిగించి నిల్చుంటే సరిపోతుందని ఫ్రిజ్‌ ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఆఫ్‌ చేయాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube