తిరుమల కొండపై ఎలక్ట్రిక్ వాహనాలు.. పర్యావరణ పరిరక్షణకు టీటీడీకి అరుదైన గుర్తింపు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో ఎలక్ట్రిక్ వాహనాలన ప్రవేశపెట్టేందుకు టీటీడీ రంగం సిద్ధం చేసింది.ఇప్పటికే ఆర్టీసీ ద్వారా కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఘాట్ రోడ్డు నడపాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోగా.

 Electric Vehicles On Tirumala Hill . Rare Recognition For Ttd For Environmental-TeluguStop.com

‌ టీటీడీ వినియోగించిన వాహనాలను కూడా దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించి 18 లక్షల రూపాయలు విలువచేసే టాటా నెక్షన్ కారును కొనుగోలు చేసి ఉండడంతో 35 టాటా నెక్షన్  వాహనాలను కోనుగోలు చేసిన టీటీడీతిరుమలకు తెప్పించింది.రెండు లేదా మూడు రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ కార్లను తిరుమలలోపనిచేస్తున్న డిప్యూటీ ఈవో స్థాయి అధికారులకు టీటీడీ కేటాయించనుంది.

ఈ కార్లను టీటీడీ ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయడంతో ఐదు సంవత్సరాల పాటు నెలకు ఒక వాహనానికి 35 వేల చొప్పున టీటీడీ టాటా కంపెనీకి ఈఎంఐ రూపంలో చెల్లించనుంది.ప్రస్తుతం తిరుమలలో టీటీడీ అధికారులు వినియోగిస్తున్న ఇంధన వాహనాలను తిరుమల నుంచి అంచెలంచెలుగా తొలగించి దశలవారీగా తిరుమల కొండపై పూర్తిస్థాయిలో ఎలక్ట్రికల్ వాహనాలన మాత్రమే వినియోగించే విధంగా టీటీడీ కార్యాచరణ రూపొందించింది.

ఈ నూతన వాహనాలకు శ్రీవారి ఆలయం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ విభాగాల్లోని అధికారులకు కేటాయించనుంది కాలుష్య నివారణ కోసం టీటీడీ తీసుకున్నఈ నూతన వాహనాల ప్రవేశంతో  బీజం పడింది.<

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube