వైరల్: చార్జింగే పెట్టవలసిన అవసరం లేని ఎలక్ట్రిక్ కార్..!

చార్జింగ్ అవసరం లేకుండా ఎలక్ట్రిక్ కారు ఎలా నడుస్తుంది? అని సందేహము రావడం సాధారణమే కానీ నిజంగానే ఒక చౌకైన ఎలక్ట్రిక్ కారు చార్జింగ్ అవసరం లేకుండానే ప్రయాణించగలదు.గంటకు గరిష్టంగా 177 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ ఎలక్ట్రిక్ కారు 3.5 సెకన్ల సమయంలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రికల్ ఎలా నడుస్తాయి అంటే.

 Electric Cars Which Does Not Require Charging , Viral, Viral Latest, Charge Less-TeluguStop.com

కారు పైకప్పున సోలార్ ఎనర్జీ ప్లేట్స్ అమరుస్తారు.దీనివల్ల నేరుగా సూర్యకిరణాల నుంచి కారు చార్జ్ అవుతుంది.

అనంతరం వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతోంది.

అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.

కానీ కారు కొన్న తర్వాత ఒక్కసారి ఛార్జ్ చేయడానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి.? కొన్న కొంతకాలానికే ఎలక్ట్రికల్ కారు రిపేర్ కి వస్తుందా అని చాలామంది అనుమానంతో ముందడుగు వేయరు.కానీ కాలం మారుతున్న కొద్దీ కొన్ని ప్రముఖ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా పర్ఫెక్ట్ గా తయారు చేస్తున్నాయి.ఎలక్ట్రిక్ వాహనాల కారణంగా వాతావరణం లో గాలి కాలుష్యం గణనీయంగా తగ్గడంతో పాటు చమురు కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.

ఇందువల్ల అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ఎలక్ట్రికల్ కార్స్ కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత చూపుతున్నారు.

Telugu Aptera Paradigm, Charge Car, Cheapest Car, Electric Car, Humblemotors, Hu

ఐతే హంబుల్ మోటార్స్ సోలార్ పవర్డ్ కంపెనీకి చెందిన SUV హంబుల్ వన్‌ కారు చార్జింగ్ అవసరం లేకుండానే ప్రయాణించగలదు.అనగా ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీని సౌరశక్తితో ఛార్జ్ చేసుకోవచ్చు.ఈ కారు పై భాగంలో సోలార్ రూఫ్‌తో పాటు విద్యుత్ ఉత్పత్తి చేసే సైడ్ లైట్లు, రీ-జనరేటివ్ బ్రేకింగ్, పీర్ టు పీర్ ఛార్జింగ్, సోలార్ అర్రే రెక్కలను ఉంటాయి.

ఈ పరికరాల వలన SUV హంబుల్ వన్‌ కారు బ్యాటరీ సులభంగా చార్జ్ అవుతుంది.

Telugu Aptera Paradigm, Charge Car, Cheapest Car, Electric Car, Humblemotors, Hu

అయితే సౌరశక్తితో నడిచే ఇంకొక సూపర్ ఎలక్ట్రికల్ కారు కూడా ఉంది.సౌర ఎలక్ట్రిక్ కార్ ఆప్టెరా పారాడిగ్మ్ అనే ఈ కారుకి ఎప్పటికీ ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు.అనగా ఈ విద్యుత్ కారు యొక్క బ్యాటరీ డైరెక్ట్ సన్ లైట్ తో ఛార్జ్ చేయబడుతుంది.

ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా సూర్యరశ్మి నుంచి ఈ కారు బ్యాటరీ చార్జ్ అవుతూనే ఉంటుంది.ఈ ఎలక్ట్రిక్ కారు గురించి ఇంకా చెప్పుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయి.ఈ కారు కేవలం 3.5 సెకన్ల సమయంలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.గరిష్టంగా 177 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ ఎలక్ట్రిక్ కారు ని పూర్తిగా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1000 మైళ్ళు, అంటే 1600 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.అయితే ఎన్నో విశేషాలు కలిగిన ఈ కార్లు కేవలం 24 గంటల్లోనే హాట్ కేక్స్ లాగా విక్రయించబడ్డాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube