4-Gears Liquid Cooling : 4-గేర్స్‌, లిక్విడ్ కూలింగ్‌తో ఇండియాలో ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ఫీచర్స్ ఇవే!

అహ్మదాబాద్‌ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మేటర్ ఇండియాలో తొలి లిక్విడ్-కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2023లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది.లాంచ్‌కి ముందు దీనిని తాజాగా ఆవిష్కరించింది.ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో మ్యాటర్ డ్రైవ్ 1.0, మిడ్-మౌంటెడ్ లిక్విడ్-కూల్డ్ 10.5kW మోటార్ ఆఫర్ చేశారు.ఇది 520Nm వేరియబుల్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

 Electric Bike Launch In India With 4-gears, Liquid Cooling These Are The Feature-TeluguStop.com

థొరెటల్ రెస్పాన్స్‌తో ఈ బైక్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.ఈ బైక్‌లో ఆఫర్ చేసిన మోటారు 5kWh లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది.

కంపెనీ ప్రకారం, బైక్ సింగిల్ ఛార్జ్ పై 125 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది.వందకు పైగా కిలోమీటర్ల రేంజ్ అందించే ఈ బైక్ పై సిటీ అంతా చక్కర్లు కొట్టొచ్చు.

  కీలెస్ ఇగ్నిషన్, ఆటో- క్యాన్సిలేషన్ ఇండికేటర్స్, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్‌తో 7-అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ కన్సోల్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో అందించారు.డెడికేటెడ్ మొబైల్ యాప్‌ను బైక్కు కనెక్ట్ చేసుకుని దాని ఛార్జ్ స్టేటస్, లోకేషన్ వంటి వివరాలను తనిఖీ చేయవచ్చు.

రైడ్ స్టాట్స్, అనాలసిస్ కూడా చూడవచ్చు.

Telugu Electric Bike, Geared Bike, Liquidcooled, Matter-Latest News - Telugu

మేటర్ ఎలక్ట్రిక్ బైక్ ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో వస్తుంది.ఇందులో ఎల్ఈడీ DRLతో డ్యూయల్-ఫంక్షనల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌, సీక్వెన్షియల్ LED ఇండికేటర్స్‌తో టెయిల్ లైట్స్‌ అందించారు.మేటర్ ఎలక్ట్రిక్ బైక్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, డ్యూయల్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్‌ సస్పెన్షన్స్‌, డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ABS వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ 2023 నుంచి షోరూమ్‌లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.ఇప్పటికే కంపెనీ 50 మంది డీలర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.దీని ధర సుమారు రూ.1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని సమాచారం.ఈ ప్రైస్‌ కాస్త ఎక్కువే అయినా పెట్రోల్ ధరలు మండుతున్న వేళ దీనిని జనాలు అధికంగా కొనేందుకు ఆసక్తి చూపవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube