అగ్ర రాజ్యం అమెరికా అధినేతను ఎన్నుకునే కీలక ఘట్టం మొదలవ్వబోతోంది.గడిచిన ఎన్నికల్లో గెలిచిన ఎలక్టోరల్స్ అందరూ కలిసి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సిద్దమయ్యారు.
ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల తంతు ఒకెత్తయితే, ఇప్పుడు మాత్రం అసలు మజా ఉండబోతోందని తెలుస్తోంది.వీరు ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే వారే అధ్యక్షుడిగా కొనసాగుతారు.
అయితే డెమోక్రటిక్ పార్టీ అమెరికా చరిత్రలోనే అత్యధిక ఎలక్టోరల్స్ ఓట్లు సాధించిన పార్టీగా చరిత్రలో నిలిచిన విషయం విధితమే.ఇప్పటికే బిడెన్ అధ్యక్షుడిగా ఎన్నిక లంచానమేనని తెలిసినా చివరి నిమిషం వరకూ ఎలక్టోరల్స్ ఎవరిని ఎంనుకుంటారోననే ఉత్ఖంట మాత్రం నెలకొంది.
ఇదిలాఉంటే.
ఎలక్టోరల్స్ తనకే ఓటు వేయాలని ట్రంప్ పట్టుపట్టడం తో పాటు ఎన్నికలల్లో బిడెన్ మోసం చేసి గెలిచాడని ట్రంప్ వాదనలకు దిగుతున్నారు.
సుప్రీంకోర్టు ను ఆశ్రయిస్తూ తన గెలుపుపై ఇప్పటికీ ధీమా వ్యక్తం చేస్తున్న ట్రంప్, తన మద్దతు దారులతో అమెరికాలో ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈరోజు జరుగనున్న ఎలక్టోరల్స్ సమావేశంపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా బిడెన్ కు 306 ఓట్లు వచ్చాయి, ట్రంప్ కు కేవలం 232 ఓట్లు రావడంతో ఇక ఒకరు ఇద్దరు ఎలక్టోరల్స్ ట్రంప్ వైపు తిరిగినా బిడెన్ గెలుపు ఖాయమే అయితే.

2016 లో సుమారు 10 మంది ఎలక్టోరల్స్ తాము గెలిచినా పార్టీకి కాకుండా ఓడిన పార్టీకి ఓట్లు వేయాలని ప్రయత్నాలు చేసినా అవి ఎక్కడా సఫలం కాలేదు, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఎదురవుతాయోమోనని ఆందోళన మాత్రం నెలకొంది.ప్రస్తుతం ఓట్లు వేసిన తరువాత మరలా జనవరి 6 వ తేదీన ఇరు సభల సమావేశంలో ఎలక్టోరల్స్ ఓట్లు లెక్కిస్తారు ఆ తరువాత మాత్రమే అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటిస్తారు.