పెద్ద పీట అన్నాడు చిన్న పీట కూడా వేయలేకపోతున్నాడా ?

ఇంటా బయటా తెలుగుదేశం పార్టీ అనేక వడి దుడుకులు ఎదుర్కుంటోంది.అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి.

 Elections Of Local Bodies In Ap Notification Release-TeluguStop.com

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అనేక ప్రజా సమస్యలను, ప్రభుత్వ పథకాల్లో లోపాలను ఎత్తి చూపిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది.అయితే అధికార పార్టీ నాయకులూ, మంత్రులు టీడీపీ కి గట్టినా కౌంటర్ ఇస్తూ గత టీడీపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న పరిణామాలను, ఇప్పటి పరిణామాలను పోల్చి చూపిస్తూ గట్టిగా వాదనకు దిగుతుండడంతో టీడీపీ మరో మాట మాట్లాడలేకపోతోంది.

ఇది ఇలా ఉంటే వచ్చే నెలలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఇప్పటికే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది.

ఈ సమరంలో గట్టెక్కేందుకు అధికార పార్టీ వ్యూహాలను గట్టిగానే సిద్ధం చేసుకుంది.ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం మరికొన్ని పథకాలను స్థానిక సంస్ధల ఎన్నికల లోపు అమలు చేసి అక్కడ కూడా తమ జెండా రెపరెపలాడించాలని చూస్తోంది.

Telugu Ap Assembly, Apcm, Ap, Tdp Chandrababu, Telugudesham Ap-

ఈ క్రమంలోనే కీలకమైన అమ్మ ఒడి పథకాన్ని జనవరి 26న ప్రారంభించాల్సి ఉండగా దీనిని అదే నెల 9వ తేదీకి మార్చింది.దీంతో ఎ న్నికలకు పక్కా వ్యూహంలో జగన్ ప్రభుత్వం రెడీ అయిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.కీలకమైన పథకాలు, ప్రజలకు మేలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, రైతు భరోసా వంటి కార్యక్రమాలు సహా యువతకు జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.అయితే టీడీపీని బలోపేతం చేసుకునే వ్యూహం చంద్రబాబు అమలుచేస్తున్నాడా లేదా అనే అనుమానం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.

ఆయన స్థానిక సంస్థలను పెద్దగా పట్టించుకోవడంలేదా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు కూడా ఆయనకు మైనస్‌గా మారుతున్నాయా అనే సందేహాలు కూడా లేకపోలేదు.

Telugu Ap Assembly, Apcm, Ap, Tdp Chandrababu, Telugudesham Ap-

నెల రోజుల కిందట చంద్రబాబు మాట్లాడుతూ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తానని, పదవుల్లో 33 శాతం వారికే కేటాయిస్తానని చెప్పుకొచ్చారు.ఇలా చేయడం వల్ల పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని, ఇది పార్టీకి బూస్ట్‌ గా పనిచేస్తుందని బాబు భావించారు.కానీ ఇప్పటి వరకు ఆ దిశగా బాబు అడుగులు వేయలేదు.యువతకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పిన తర్వా త కూడా తెలుగు యువత అధ్యక్షుడుగా ఉన్న అవినాష్ పార్టీ మారిపోవడం, యువ నాయకులు పెద్ద ఊపు చూపించకపోవడం వంటివి టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి.

ఈ పరిస్థితి మార్చేందుకు చంద్రబాబు ఏమైనా కీలక నిర్ణయాలు ప్రకటించాల్సిన అవసరం ఉంది.లేకపోతే అధికార పార్టీ తట్టుకోవడం కష్టమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube