ట్రంప్ కి 'మధ్యంతర'...అగ్నిపరీక్ష

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతోంది…రాజకీయంగా ట్రంప్ కి ఇది తొలి అగ్ని పరీక్షఅనే చెప్పాలి.రేపు అనగా మంగళవారం జరగనున్న మధ్యంతర ఎన్నికలు.

 Elections In America 2018 From Tomorrow1-TeluguStop.com

భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఆరున్నరకు పోలింగ్‌ ప్రారంభం కానున్నాయి.అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు; సెనేట్‌లోని 35 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అంతేకాదు వీటితో పాటుగా దాదాపు 36 రాష్ట్రాలకు గవర్నర్లను కూడా ఎన్నుకోనున్నారు.రెండేళ్ల ట్రంప్‌ పాలనకు ఈ ఎన్నికలను కొలమానంగా భావిస్తున్నారు…అయితే ఈ ఎన్నికల్లో ట్రంప్ వైపు విజయం వస్తుందా లేదా అనేది సందేహమే ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్న విధానాలని ఎంతోమంది అమెరికన్లు తప్పు బట్టారు.సొంత పార్టీ నేతలే ట్రంప్ పై వ్యతిరేకత వెళ్లగక్కారు.అలాంటిది ఇప్పుడు మధ్యంతర ఎన్నికల్లో వచ్చే తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిని రేపుతోంది.

ఇదిలాఉంటే అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మధ్యంతర ఎన్నికలుగా ఈ ఎన్నికలని గుర్తిస్తున్నారు.ఎందుకంటే గెలుపు ధ్యేయంగా ఇరు పార్టీలూ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతున్నాయి.గతంలో అత్యధికంగా 4.2 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తే.ఈ ఎన్నికల్లో 5.2 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు రూ.38 వేల కోట్లు ఖర్చు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube