అమెరికాలో ఎన్నికల హీట్...అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ...!!!

అమెరికాలో ఎన్నికల హీట్ రోజు రోజుకి పెరిగిపోతోంది.తమ పార్టీ అధికారంలోకి వస్తుందని డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 Elections Heat In America About Everything Is Free-TeluguStop.com

ఈ క్రమంలోనే డెమోక్రాట్లు కొత్త నినాదం అందుకున్నారు.అందరికి విద్య , ఆరోగ్యం, ఉచిత యూనివర్సిటీ విద్య వంటివి తమ పదకాలని బల్లగుద్ది మరీ చెప్పారు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న బెర్నీ శాండర్స్‌

-Telugu NRI

ఈ పధకాల అమలుకు ప్రజలపై పన్ను భారం పడుతుంది కదా మరి ప్రజలపై ఈ భారాన్ని వేస్తారా అనే ప్రశ్నకి బదులుగా ప్రతిపాదనల అమలు జరగాలంటే ప్రజలు పన్ను భారాన్ని భరించాల్సిందే అంటూ క్లారిటీ ఇచ్చారు.

అమెరికాలో కొనసాగుతున్న అసమానతలు తీవ్రంగా ఖండించిన ఆయన ఆరోగ్య పరి రక్షణ మనిషి యొక్క ముఖ్యమైన హక్కని తెలిపారు.

ఇదిలాఉంటే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్శిటీల నుంచీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు వంద మంది వైద్య ,విద్యా ప్రొఫెసర్లు, విద్యార్ధులపై ఉన్న దాదాపు 160 లక్షల కోట్ల డాలర్ల విద్యా రుణాన్ని మాఫీ చేయాలని చెప్పిన శాండర్స్‌ ప్రతిపాదనకి మద్దతు తెలిపారు.

ఇదే అమలు జరిగితే ఎంతో మంది విద్యార్ధులకి ఆర్ధిక భారం తగ్గినట్టేనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంతో శాండర్స్‌ తో పాటు మరికొందరు డెమోక్రటిక్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube