వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లను గెలవడం కూడా కష్టమేనని బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ అన్నారు.కల్వకుర్తిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడ్డారు.
రైతుబంధు, రైతుబీమా ఇచ్చే ఒకే ఒక్క సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.అయితే కేసీఆర్ ఓడించాలని చాలా మంది ఏకమయ్యారన్నారు.
కానీ కేసీఆర్ సింగిల్ గానే వస్తారన్న కేటీఆర్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలో బీజేపీ ఖాళీ అయిందని చెప్పారు.
ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయన్నారు.ఈ క్రమంలోనే పదకొండు సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.