ఎన్నికలలో బ్లూ ఇంక్ ఎందుకు వాడుతారో తెలుసా ! బ్లూ ఇంక్ గురించి మీకు తెలియని విషయాలు..  

Elections 2019 Why Blue Ink Used In Election Know Everything -

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఓట్ల పోలింగ్ ఉంటుంది.ఓటు వేసే ప్రతి ఓటర్ ఓటు వేసే ముందు సంతకం చేస్తాడు తరువాత అక్కడ ఉన్న ఎన్నికల పోలింగ్ బూత్ అధికారులు మన వేలికి బ్లూ ఇంక్ సిరా ని పూస్తాడు.

Elections 2019 Why Blue Ink Used In Election Know Everything

దీని వల్ల ఒకసారి ఓటు వేసిన వ్యక్తి మళ్ళీ అదే పోలింగ్ లో ఓటు వేయకుండా అరికట్టడానికి ఈ పద్దతిని 1962 నుండి మొదలుపెట్టారు.

మొదటిసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చాలా సమస్యలు ఎదుర్కొంది.

ఎన్నికలలో బ్లూ ఇంక్ ఎందుకు వాడుతారో తెలుసా బ్లూ ఇంక్ గురించి మీకు తెలియని విషయాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఓటు వేసినవాళ్లు మళ్లీ ఓటు వేసేందుకు వస్తుండటంతో ఎలా అడ్డుకోవాలో అర్థం కాలేదు.అప్పుడే కొన్నిరోజుల వరకు చెరిగిపోని సిరాతో గుర్తు వేయాలన్న ఆలోచన వచ్చింది.

1)భారతదేశం లో బ్లూ ఇంక్ మొట్టమొదటిసారి

మన దేశం లో 1962లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారిగా బ్లూ ఇంక్ వాడటం మొదలుపెట్టారు.ఆ ఘనత మొదటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్‌కు దక్కుతుంది.ఎన్నికల్లో ఇంక్ వాడే సంప్రదాయం అప్పుడే మొదలైంది.37(1) నిబంధన ప్రకారం ఓటర్ ఎడమచేతి వేలుపై సిరా గుర్తును చూడాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిది.ఎన్నికల్లో ఓటు వేసేప్పుడు బ్లూ ఇంక్‌తో పెట్టే గుర్తు 15 రోజులపాటు అలాగే ఉంటుంది.గోళ్లపై నుంచి గుర్తు మొత్తం చెరిగిపోవడానికి కనీసం మూడు నెలలైనా పడుతుంది.

2)అసలు ఆ బ్లూ ఇంక్ గుర్తు అన్ని రోజులు ఎందుకు చేరిగిపోదు

సిల్వర్ నైట్రేట్ పేపర్‌పై రాసేందుకు ఉపయోగించే ఇంక్ కాదు.సిల్వర్ నైట్రేట్‌ను వేలిపై గోరు కింద అప్లై చేయగానే చర్మంపై ఉండే ఉప్పుతో కలిసి చెరిగిపోకుండా గుర్తు ఏర్పడుతుంది.ఆ గుర్తును వెంటనే చెరపడం అంత సులువుకాదు.అందుకే ఎన్నికల సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉంటుంది.

3)దీనిని ఎవరు తయారు చేస్తారు

నేషనల్ ఫిజికల్ ల్యాబరేటరీ, నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సాయంతో సిరాను మైసూర్ పెయింట్స్ మరియు వార్నిష్ లిమిటెడ్ సంస్థలు కలిసి తయారు చేస్తున్నాయి.ఈ బ్లూ ఇంక్ సిరాను భారతదేశంలో జరిగే ఎన్నికల్లోనే కాదు, కాంబోడియా, మాల్దీవ్స్, నేపాల్, దక్షిణాఫ్రికా,కెనడా , టర్కీ లాంటి దేశాలకు కూడా మన దేశం నుండే ఎన్నికల ఇంక్ ఎగుమతి అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు