సర్వే లెక్కలు పార్టీల కొంప ముంచుతాయా ! ప్రధాన పార్టీల అతి విశ్వాసం  

రాజకీయ పార్టీలని తప్పుదోవ పట్టిస్తున్న పొలిటికల్ సర్వేలు. .

Election Surveys Misleading On Political Parties-janasena,misleading On Political Parties,tdp,ysrcp

ఎన్నికలు ఎప్పుడు జరిగిన జాతీయ మీడియా సంస్థల నుంచి, స్థానికంగా ఉన్న కొంత మంది సేఫాలజిస్ట్ లు ఎన్నికల సర్వేలు అంటూ ఏవేవో లెక్కలు చూపిస్తూ ఉంటారు. ఇలా బయటకి వచ్చిన సర్వేలలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు పొందినట్లు ఉంటే ఆ పార్టీకి చెందిన మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచారం చేసుకుంటాయి. అయితే సర్వేలో వచ్చిన ఫలితాలే ఎన్నికలలో కూడా వస్తాయా అంటే చెప్పలేని పరిస్థితి..

సర్వే లెక్కలు పార్టీల కొంప ముంచుతాయా ! ప్రధాన పార్టీల అతి విశ్వాసం-Election Surveys Misleading On Political Parties

ఎందుకంటే ఒక్క రోజులోనే ఓటర్ ఆలోచన మార్చగలిగే శక్తి, అలాగే ఒక్క రోజుల్లోనే ఓటర్ ఎవరికీ ఓటు వేయాలో నిర్ణయించుకునే అవకాశం లభిస్తుంది. ఆ ఒక్క రోజు ఓటింగ్ కి వెళ్ళే సమయంలో ప్రజల ఆలోచన ఎలా ఉందో అలాగే ఓటు వేస్తారు.

ఇక అంతకు ముందు తాము ఎన్ని చెప్పిన అవన్నీ పూర్తిగా మరిచిపోతారు.

ఇది ఎప్పుడు ఎన్నికలలో జరిగేదే. కాని ఎన్నికల సమయంలో ఈ సర్వేలని చూసుకుంటూ పార్టీ నేతలు అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. ప్రజాభిప్రాయం తమకి అనుకూలంగా ఉంది అంటూ ప్రచారం చేసుకుంటారు.

సర్వేలలో చెప్పినట్లు స్పష్టమైన రిజల్ట్ ఎప్పుడు కూడా ఎన్నికలలో రాలేదు. కాని పార్టీలు ఆ సర్వేలని పదే పదే ప్రచారం చేసుకోవడానికి కారణం ప్రజల ఆలోచన మార్చి సర్వేలు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వారికే ఓటు వేద్దాం అని నిర్ణయం మార్చుకుంటారు.

తాజాగా మరోసారి ఏపీలో ఎన్నికల సర్వేలు హోరెత్తిస్తున్నాయి. జాతీయ మీడియాలు నుంచి, లోకల్ మీడియాల వరకు అందరూ సర్వేలు రిలీజ్ చేస్తున్నారు.

వీటిలో మెజారిటీ వైసీపీ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెప్పుకోచ్చాయి. గత ఎన్నికలలో కూడా అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెప్పుకోచ్చాయి. అయితే జనసేన పార్టీ ప్రభావం కారణంగా టీడీపీ అధికారంలోకి వచ్చింది..

ఈ సారి కూడా జనసేన పార్టీని అసలు జాతీయ మీడియా సంస్థలు పరిగణంలోకి తీసుకోకుండా ఫలితాలు ప్రకటించాయి. అయితే స్థానికంగా మాత్రం జనసేన ప్రభావం రెండు పార్టీల మీద ఉండబోతుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి వేళ మళ్ళీ సర్వేలని నమ్ముకొని అధికార, ప్రతిపక్ష పార్టీలు ధీమాగా ఉంటే భారీ దెబ్బ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.