టీటీడీ బంగారాన్ని కూడా వదలని ఎన్నికల సంఘం! భారీగా స్వాదీనం  

తమిళనాడులో టీటీడీ బంగారం సీజ్ చేసిన పోలీసులు. .

Election Squad Seize Ttd Gold In Tamilanadu-dmp,election Squad,lok Sabha Elections,seize Ttd Gold,tamilanadu

తమిళనాడు రాజకీయాలలో డబ్బు ప్రవాహం ఎ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా వెల్లూరు నియోజకవర్గంలో లోక్ సభ ఎన్నికలని కూడా ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది. భారీగా డబ్బు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది..

టీటీడీ బంగారాన్ని కూడా వదలని ఎన్నికల సంఘం! భారీగా స్వాదీనం-Election Squad Seize TTD Gold In Tamilanadu

ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న తనిఖీలలో టీటీడీకి చెందిన బంగారంని స్వాదీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా వేపంపట్టులో 1,381 కేజీల బంగారాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే స్వాధీనం చేసుకున్న బంగారం టీటీడీది అని పట్టుబడ్డ వారు చెబుతున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఈ బంగారం తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

పీఎన్‌బీలో టీటీడీ బంగారం ఉందని, దానికి మెచ్చూరిటీ టైం ముగియడంతో బంగారంను తీసుకెళ్లాలని పీఎన్‌బీ అధికారులు టీటీడీకి సూచించారు. అయితే అంతలోనే పీఎన్‌బీ అధికారులు బంగారాన్ని తరలించారు. ఇప్పుడు ఈ బంగారం స్వాదీనం తెలంగాణలో సంచలనంగా మారింది.

అయితే ఆ బంగారం పూర్తి బాద్యత బ్యాంకుదే అని టీటీడీ అధికారులు తేల్చి చెప్పేశారు.