పెళ్లి వేడుకలో ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారం... వైరల్‌ అవుతున్న పెళ్లి ఆహ్వాన పత్రిక  

Election Results At Marriage Ceremony-marriage,may 23rd,ఎన్నికల ఫలితాలు విడుదల,నెల్లూరు జిల్లా

ఈమద్య కాలంలో జనాలు ఫంక్షన్స్‌ మరియు ఇతర వేడుకలకు హాజరు అవ్వడం అంటే బద్దకిస్తున్నారు. చాలా దగ్గరి వారి పెళ్లి వేడుక లేదంటే ఇతర వేడుకలకు అయితేనే హాజరు అవుతున్నారు. తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే వాటికి వెళ్తున్నారు..

పెళ్లి వేడుకలో ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారం... వైరల్‌ అవుతున్న పెళ్లి ఆహ్వాన పత్రిక-Election Results Live At Marriage Ceremony

కాస్త దూరం అనుకున్న వారి వేడుకలను దాదాపుగా స్కిప్‌ చేస్తున్నారు. ఇక అదే రోజు ఏదైనా చిన్న ఇతర పని ఉన్నా కూడా లేదంటే ముఖ్యమైన టీవీ కార్యక్రమాలు ఉన్నా కూడా ఆ వేడుకలకు ఆమడ దూరంలో ఉంటున్నారు. అలాంటిది దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న పార్లమెంటు ఎన్నికల ఫలితాల రోజున వివాహ వేడుక ఏర్పాటు చేస్తే ఇంకా ఏమైనా ఉందా, ఖచ్చితంగా జనాలు ఆ వేడుకకు పల్చగానే వస్తారు.

నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి బయ్యా వాసు తన కుమార్తె వివాహంను అదే రోజున నిర్వహించబోతున్నాడు. ఆ రోజున ఆమె వివాహం మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో వేల పెళ్లిలు ఉన్నాయి. ఆ రోజు మంచి ముహూర్తం అవ్వడం వల్ల ఎన్నికల ఫలితాలు ఉన్నాయనే విషయాన్ని పట్టించుకోకుండా మే 23న పెద్ద ఎత్తున పెళ్లిలు పెట్టుకున్నాడు. వాసు కూడా తన కూతురు పెళ్లిని అదే రోజున నిశ్చయించాడు. అయితే జనాలు రాకుండా ఉంటారేమో అని అతడికి భయం పట్టుకుంది.

అందుకే పెళ్లి కార్డులను చాలా విభిన్నంగా కొట్టించి, అబ్బ ఆ పెళ్లికి పోవాలిరా అన్నట్లుగా చేశాడు. .

ఇంతకు పెళ్లి కార్డుల్లో ఏమని కొట్టించాడంటే. అప్సరసలచే బంధు మిత్రులకు ఆహ్వానం, ఇక అదే రోజున ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో వాటిని మిస్‌ కాకుండా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేయబోతున్నాం.

పెద్ద స్క్రీన్క్‌పై ఎప్పటికప్పుడు ట్రెండ్స్‌ను మీరు తెలుసుకోవచ్చు. అందువల్ల మే 23వ తారీకున తప్పకుండా వచ్చి నా బిడ్డను ఆశీర్వదించండి అంటూ ఆహ్వాన పత్రికలో వేయించాడు. ఇతడి ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అంతా బాగానే ఉంది కాని పెళ్లి వేడుకలో ఎన్నికల ఫలితాలు చూసుకుంటూ నా పార్టీ, నీ పార్టీ అంటూ కొట్టుకుంటే పరిస్థితి ఏంటీ వాసు గారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు..