ఎన్నికల ఫలితాలపై టెన్షన్ గా ఎదురుచూస్తున్న నేతలు! 2 గంటలకే క్లారిటీ  

ఎన్నికల ఫలితం కోసం టెన్షన్ గా ఎదురుచూస్తున్న అధినేతలు. .

Election Result Will Concluded Mid Day-

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కి మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.ఇక ఎన్నికల ఫలితాల నేపధ్యంలో ప్రధాన పార్టీలైన తెలుగు దేశం, వైసీపీ, జనసేన పార్టీ అధినేతలు రాజధానికి చేరిపోయారు.

Election Result Will Concluded Mid Day--Election Result Will Concluded Mid Day-

ఇక ఈ ఎన్నికలలో ప్రధాన ప్రత్యర్ధులుగా తెలుగు దేశం, వైసీపీ ఉన్నాయి.ఈ రెండు పార్టీలలో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాను కోరుకున్న మార్పుకి ప్రజల నుంచి ఎంత వరకు మద్దతు లభించింది అనేది తెలుసుకోవాలనే ఆసక్తితో చూస్తున్నారు.

ఏపీలో కింగ్ మేకర్ గా జనసేన ఉంటుంది అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలు మూడు పార్టీలకి కాస్తా టెన్షన్ పెడుతున్నాయి అని చెప్పాలి.ఎ ఒక్కరు కూడా పూర్తిగా ఫలితాలపై నమ్మకంతో లేరనే మాట వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకి మొదలవుతుంది.ఇక ఎన్నికల కౌంటింగ్ ప్రకారం 2 గంటలకి ఫలితం తెలిసిపోతుందని, అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, వీవీ ప్యాట్ ల లెక్కింపు కారణంగా ఫలితం అధికారికంగా ప్రకటించడం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారి కూడా స్పష్టం చేసేసారు.ఈ నేపధ్యంలో ప్రధాన పార్టీల గెలుపుపై బెట్టింగ్ లు వేసిన వారు కూడా ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.