పసుపు పచ్చ లేడీ ఆఫీసర్ డ్యాన్సింగ్ వీడియో,ఫిదా అవుతున్న నెటిజన్లు

ఆ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి ఒక లేడీ ఆఫీసర్ పసుపు పచ్చ చీరలో మెరుపులా మెరిసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న రీనా ద్వివేదీ గుర్తుంది కదా.ఆ రోజు ఆమెను చూసిన చాలా మంది నిజంగా ఈమె ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన లేడీ ఆఫీసరా లేదా సినిమా హీరోయినా అన్న రేంజ్ లో ఆ రోజు ఆమె లుక్స్ ఉన్నాయి.

 Election Officer Reena Dwivedi Dance Video-TeluguStop.com

దీనితో ఆమె ను చూసిన జనాలు ఆమె పిక్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇక అంతే ఆ ఒక్క ఫోటో తో ఆమె దేశాన్నే తన వైపుకు తిప్పుకొని,ప్రతి ఒక్కరూ ఆమె గురించి చర్చించడమే సరిపోయింది.

ఆమె యూపీ కి చెందిన పీడబ్యూడీ ఆఫీసర్.ఆమె ఇప్పుడు తాజాగా తన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.

ఫోటో చూసే తెగ గుటకలు వేసిన నెటిజన్లు ఇప్పుడు ఆమె డ్యాన్స్ చూసి ఊరుకుంటారా.ఆమె డ్యాన్స్ కు కూడా నెటిజన్లు ఫిదా అయిపోయి ఇప్పుడు ఆమె డ్యాన్స్ కు విపరీతమైన లైక్ లు కొడుతున్నారు.

ఆమె డ్యాన్సింగ్ వీడియో ను రీనా నే తన పేస్ బుక్ పేజీ లో పోస్ట్ చేసింది.ఇక అంతే ఫిదా అయిపోయిన నెటిజన్లు ఆమె డ్యాన్సింగ్ వీడియో కు లైక్ లు షేర్లు ఎక్కువైపోయాయి.

పసుపు పచ్చ లేడీ ఆఫీసర్ డ్యాన్�

ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.మొత్తానికి సెలబ్రిటీ కానీ ఒక ఆఫీసర్ ఆమె ఫిజిక్ తో సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది.ఇక ఇంకా ఎలాంటి వీడియోలను ఈ అమ్మడు పోస్ట్ చేస్తుందో, ఇక నెటిజన్లు ఇంకా ఎన్ని వీడియోలకు ఇలా ఫిదా అయిపోతారో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube