వోట్ వేసిన తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ ని సుబ్బారావు ఏమడిగారో చూస్తే నవ్వాపుకోలేరు.! సరదాకోసమే.!

ఓటు వేశారా.అంటే నోటితో సమాధానం చెప్పనవసరం లేదు.

 Election Officer And Voter Funny Conversation-TeluguStop.com

సిరా గుర్తున్న వేలిని చూపిస్తే చాలు.సిరా చుక్కకి ఓటుకు ఉన్న సంబంధం అలాంటిది.

మనం ఓటు వేయడానికి పోలింగ్ బూతుకి వెళ్లగానే మన ఓటరు గుర్తింపు కార్డు పరిశీలించి అనంతరం అక్కడున్న సిబ్బంది మన చేతి వేలికి నేరేడు రంగులో ఉన్న సిరాను పూస్తారు గుర్తుందా.? నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తు పెట్టేందుకు భారత ఎన్నికల సంఘం ఈ విధానాన్ని దశాబ్ధాలుగా అమలు చేస్తోంది.సిరా పూసిన వేలితో సెల్ఫీలు దిగి.తాము కూడా ఓటు వేశామని చూపించి గర్వంగా ఫీలవుతారు భారతీయులు.

అయితే ఇప్పుడు ఎక్కడ చూసిన ఎన్నికల హడావిడి నడుస్తుంది.ఓ నలుగురు కలిశారంటే మాట్లాడేది ఎన్నికల గురించే.

అలాంటి తరుణంలో మీకోసం ఓ ఫన్నీ సంభాషణ.ఎలక్షన్ ఆఫీసర్ తో ఓటు వేసిన తర్వాత సుబ్బారావు ఏమడిగారో తెలుస్తే నవ్వుకుంటారు.

ఇది కేవలం నవ్వుకోడానికి రాసింది.తప్పుగా అనుకోకండి.

ఎలెక్షన్స్ లో వోటు వేసిన తరువాత సుబ్బారావు ఎలెక్షన్ ఆఫీసర్ ని అడిగాడు.

“చేతి మీద ఇంకు మరక, నీళ్ళతో కడిగితే పోతుందా?”
“పోదు!” అన్నాడు
“షాంపూతో కడిగిన పోదా? “
” పోదు” అన్నాడు ఎలెక్షన్ ఆఫీసర్
“ఎన్ని రోజుల వరకు మరక పోకుండా ఉంటుంది? “
ఎలెక్షన్ ఆఫీసర్ చిరాగ్గా “సంవత్సరమైనా పోదయ్యా!”
సుబ్బారావు ఆనందంగా, ఆశగా,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

“సారూ,


అయితే, కొంచెం నా జుట్టుక్కూడా పూయండి.
ఎంత డై రాసుకున్నా వారం రోజులకే జుట్టు తెల్ల బడుతుంది సారూ!”
ఎలెక్షన్ ఆఫీసర్ కింద పడి కొట్టుకొని స్పృహ తప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube