వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు మేయర్ల ఎన్నిక.. మహిళలకే ప్రాధాన్యత.. !

ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కాగా ఈ ఎన్నికల్లో మహిళలకు అధికప్రాధాన్యత ఇచ్చారు.

 Election Of Mayors For Warangal And Khammam Corporations Preference For Women-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఇక్కడి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ పేర్ల‌ను టీఆర్ఎస్ అధిష్టానం ఖ‌రారు చేసింది.

ఇక వరంగల్ 29వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచిన గుండు సుధారాణిని మేయర్ గా ప్రకటించగా, వరంగల్ 36వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచిన రిజ్వానా ష‌మీమ్ ను డిప్యూటీ మేయ‌ర్‌ గా మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి క‌లిసి ప్ర‌క‌టించారు.

 Election Of Mayors For Warangal And Khammam Corporations Preference For Women-వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు మేయర్ల ఎన్నిక.. మహిళలకే ప్రాధాన్యత.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరోవైపు ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ పేర్ల‌ను కూడా అధిష్టానం ఖ‌రారు చేసింది.వీరిలో ఖమ్మం 26వ డివిజ‌న్ కార్పొరేటర్ గా గెలిచిన పునుకొల్లు నీర‌జ‌ ను మేయ‌ర్‌ గా, 37వ డివిజ‌న్ కార్పొరేటర్ గా గెలిచిన ఫాతిమా జోహ్రో ను డిప్యూటీ మేయ‌ర్‌ గా మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.

ఇకపోతే ఈ ఎన్నికల్లో మహిళలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడంలో ఏదో వ్యూహం తప్పక ఉందనే విషయం అర్ధం అవుతుందని కొందరు అనుకుంటున్నారట.

#Gundu Sudharani #Womens #Khammam #Deputy Mayor #Warangal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు