కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. ఏప్రిల్ 30న పోలింగ్.. మే 3 న కౌంటింగ్..!

తెలంగాణా రాష్ట్రంలో జరగాల్సిన 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ నెల 30న ఈ ఎలక్షన్స్ జరుగనున్నాయి.

 Election Notification Released For Muncipal Corporation Telangana State-TeluguStop.com

కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ జరుగుతుంది.మే 3న కౌంటింగ్ చేస్తారని తెలుస్తుంది.

ఈ నెల 16 నుంచి నామినేషన్లను తీసుకుంటారని సమాచారం.నామినేషన్లకు చివరి తేది ఈ నల 18, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 22 అని తెలుసుతంది.

 Election Notification Released For Muncipal Corporation Telangana State-కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. ఏప్రిల్ 30న పోలింగ్.. మే 3 న కౌంటింగ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఖమ్మం, వరంగల్ లో కార్పోరేషన్ ఎలక్షన్స్ జరగనున్నాయి.ఇక అచ్చంపేట, సిద్ధిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 66 డివిజన్లు ఉన్నాయి ఖమ్మం కార్పొరేషన్ కు 60 డివిజన్లు ఏర్పాటు చేశారు.టీ.ఆర్.ఎస్ తో పాటుగా కాంగ్రేస్, బీ.జే.పీ పార్టీలు ఈ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కు సన్నద్ధం అవుతున్నారు.ఖమ్మం, వరంగల్ రెండిటిలో టీ.ఆర్.ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు మిగతా పార్టీలు సిద్ధం అవుతున్నాయి.అయితే టీ.ఆర్.ఎస్ కూడా ఈ రెండు కార్పొరేషన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.ముఖ్యంగా ఖమ్మం మీద టీ.ఆర్.ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.ఖమ్మంలో 60 డివిజన్లు ఉండగా 60 స్థానాలను టీ.ఆర్.ఎస్ గురి పెట్టడం విశేషం. అయితే ఖమ్మంలో టీ.ఆర్.ఎస్ తో పాటుగా గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్, బీ.జే.పీ పార్టీలు కూడా రెడీ అవుతున్నాయి.

#Released #Corporation #Muncipal #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు